BigTV English

Swetha Menon : శ్వేత మీనన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

Swetha Menon : శ్వేత మీనన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

Swetha Menon : ప్రముఖ మలయాళ హీరోయిన్ శ్వేతా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమెపై పోలీస్ కేసు నమోదు అయింది. డబ్బు కోసం అశ్లీల చిత్రాల్లో నటించడమే అందుకు కారణంగా కనిపిస్తుంది.. కొచ్చి సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో నగ్న, అశ్లీల వీడియోలు ప్రసారం చేసిందని ఆమె పై పోలీసులు కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం…


డబ్బుల కోసమే అశ్లీల వీడియోలు..?

శ్వేతా మీనన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నగ్న, అశ్లీల వీడియోలు ప్రసారం చేసిందని నటి శ్వేతా మీనన్ పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఆమె డబ్బుల కోసమే ఇలా చేస్తుంది. యువతను తప్పు ద్రోవ పట్టిస్తుందని ఆరోపిస్తూ మార్టిన్ మొనచేరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఐటి చట్టంలోని సెక్షన్ 67 ఏ ప్రకారం అశ్లీల కార్యకలాపాల నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న కొచ్చి పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు.


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి పోటీ..

ఈ అమ్మడు ఇటీవల మాలయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ పోటీ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు అవ్వటం ఇప్పుడు మాలీవుడ్‌ లో సంచలనంగా మారింది.. ఇలాంటి వీడియోలు తీసి చాలా కాలం అయింది. ఇప్పుడు దీని గురించి చర్చలు జరపడం అనుమానాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.. ఆగస్టు 15న ఈ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల కానున్నాయి. గతంలో మూడు పర్యాయాలుగా సూపర్ స్టార్ మోహన్ లాల్ అధ్యక్షుడిగా కొనసాగారు.. ఆయన తప్పుకోవడంతో మళ్ళీ ఆ పదవికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

Also Read : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

శ్వేత మీనన్ సినిమాలు..

శ్వేత మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ‘రతినిర్వేదం’ అనే డబ్బింగ్ సినిమా తో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది… అంతేకాదు నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించింది.. ప్రస్తుతం ఈమె పై నమోదైన కేసులు చర్చినీయాంశంగా మారింది.. ఇందులో ఎన్ని ట్విస్ట్ లు ఎదురవుతాయో చూడాలి.. గతంలో ఈ అమ్మడు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయని తెలుస్తుంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..

Related News

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

‎Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

Teja Sajja: ప్రభాస్, ఎన్టీర్ తరువాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

Big Stories

×