BigTV English
Advertisement

Mayasabha Review : మయసభ రివ్యూ 

Mayasabha Review : మయసభ రివ్యూ 

Mayasabha Review : వెన్నెల సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన దేవకట్ట. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ముఖ్యంగా దేవకట్ట అంటే.. తాను సమాజాన్ని చూసే దృక్కోణం,తన డైలాగ్స్ లో ఉన్న డెప్త్ ఇవన్నీ మనకి ప్రత్యేకంగా అనిపిస్తాయి. ప్రస్థానం వంటి సినిమాను చూసినప్పుడు… ఈరోజుకి కూడా ఒక విలేజ్ పొలిటికల్ డ్రామాని అంత బాగా ఎలా తీయగలిగాడు అనిపిస్తుంది. అలానే ఆటోనగర్ సూర్య సినిమాల్లో కొన్ని డైలాగులు వ్యవస్థను క్వశ్చన్ చేసేటట్లు ఉంటాయి. రిపబ్లిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక అటువంటి దర్శకుడు నుంచి ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ వస్తుందే అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాసేపటి క్రితం సోనీ లీవ్ లో ఓటిటి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


కథ : 

రెండు వేరువేరు కులాలకు చెందిన కాకర్ల కృష్ణం నాయుడు, ఎమ్మెస్ రామిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. ఇద్దరూ వేరు వేరు పరిస్థితులను దాటి వచ్చారు. అయితే ఇద్దరి ఆలోచనలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. చదువుకునే రోజుల నుండి స్టూడెంట్ లీడర్స్ గా ఎదిగి ఆ తర్వాత పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారు. ఒకే పార్టీలో ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫ్రెండ్షిప్ కుదిరింది. అలానే రామిరెడ్డి ఉన్న పార్టీ నుండి, కాకర్ల కృష్ణం నాయుడు వేరే పార్టీకి వెళ్లిపోవడానికి కారణాలేంటి.? వేరే పార్టీకి వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి.? రాయపాటి చక్రధర్ రావు (Rcr) అనే వ్యక్తి ఎవరు.? అలానే బాబురావు ఎవరు.? Rcr, Kkr కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? రాయపాటి చక్రధర్ రావు పార్టీలో ఎంట్రీ ఇచ్చిన కృష్ణం నాయుడు ఎందుకు చక్రధర్ రావుకి ఎదురు తిరిగాడు.? ఇలాంటి అంశాలన్నీ తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.


విశ్లేషణ

దర్శకుడు దేవకట్ట ఈ సినిమాలోని కొన్ని పాత్రలను నిజజీవితంలో ఉండే కొంతమంది వ్యక్తులకు దగ్గరగా తయారు చేశాడు. అయితే చాలా తెలివిగా పలు ఇంటర్వ్యూస్ లో, ఈ పేర్లను మారుస్తూ చెప్పుకొచ్చారు. కానీ ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఈ వ్యక్తి రియల్ లైఫ్ లో ఇతను కదా అని అనిపించక మానదు. ఒకప్పుడు జరిగిన రియల్ స్టోరీకి కొంత ఫిక్షనల్ యాడ్ చేసి ఈ సిరీస్ ప్రెసెంట్ చేశాడు దేవకట్ట.

కాకర్ల కృష్ణం నాయుడు అనే పాత్రలో ఆది పినిశెట్టి కనిపించాడు. ఆది పర్ఫామెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే కృష్ణం నాయుడు అనే పాత్రలో అద్భుతంగా నటించాడు. అక్కడక్కడ నత్తిగా మాట్లాడటం కొంచెం ప్రేక్షకుడికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎమ్మెస్ రామ్ రెడ్డి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడని చెప్పాలి. పులిచెర్ల అనే ప్రాంతపు యాసను అద్భుతంగా మాట్లాడాడు.

రాయపాటి చంద్రశేఖర రావు అనే పాత్రను సాయికుమార్ పోషించారు. ఈ పాత్రను చూస్తున్న తరుణంలో తెలుగు సినిమా పరిశ్రమ గొప్పగా చెప్పుకొని ఒక నటుడు తప్పకుండా గుర్తొస్తారు. మనం మర్చిపోదాం అనుకున్న కూడా సాయికుమార్ మాట్లాడే హావభావాల వలన ఆ నటుడు మనకు సాయికుమార్ లో కనిపిస్తారు. శివాజీ రావు అనే పాత్రలో నాజరు కనిపించారు. మిగతా పాత్రలో నటించిన వాళ్లంతా ఆయా పాత్రలకు న్యాయం చేశారు.

మొత్తానికి అక్కడక్కడ దేవకట్ట స్టైల్ డైలాగ్స్ వినిపిస్తాయి. అలానే ఆ పాత్ర నేపథ్యాలను తీసుకుని ఎలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అని అంశాలను కొంతమేరకు బాగానే చూపించాడు. కానీ అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని డైరెక్టుగా చెప్పకుండా అటుతిప్పి ఇటు తిప్పి చెబుతున్నట్లు అనిపిస్తుంది. అలానే బాబురావు అనే పాత్రను కేవలం కామెడీకి మాత్రమే పరిమితం చేశారు.

ఒక ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలైన ఈ సిరీస్, అదే సన్నివేశంతో ఎండ్ అవుతుంది. మొత్తం 9 ఎపిసోడ్లుతో సాగిన ఈ సిరీస్ ఇంత సాగదీయాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అప్పటి రోజులను బాగానే చూపించారు. గుర్తుండిపోయే పాటలు లేవు గాని కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్క్ అవుట్ అయింది.

ప్లస్ పాయింట్ 

నటీనటులు పర్ఫామెన్స్

డైరెక్షన్

దేవకట్ట రైటింగ్

సిరీస్ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

అక్కడక్కడ ల్యాగ్ సీన్స్

కొన్ని కల్పితం అనిపించిన సీన్స్

మొత్తంగా: చరిత్ర కోసం చూడాల్సిన ఇంట్రెస్టింగ్ డ్రామా

Mayasabha Review Rating : 3/5

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×