BigTV English

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Megastar Chiranjeevi : పురుషులందు పుణ్య పురుషులు వేరు.. ఇది ఈరోజుల్లో కొందరిని చూస్తుంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు చేస్తున్న సేవలను చూస్తే ఈ మాట వాళ్లకు కరెక్ట్ గా సూట్ అవుతుందని అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఫౌండేషన్ లను పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ప్రజలకు సాయం చేస్తున్నామని చెబుతున్నారు. ఈ మాట వింటే చిరంజీవి గ్రేట్ అనే మాట వినిపిస్తుంది. చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది.. నేడు మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వచ్చాడు. అక్కడ ఆయన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది..


అభిమానుల ప్రేమకు నేను దాసినే..

ఈ మెగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజ సజ్జా, సంయుక్త మీనన్ హాజరవగా.. విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ సందర్బంగా ఈయన మాట్లాడుతూ.. రక్తదానం ఓ మహాదానం.. యువత అందరూ ముందుకొచ్చి, సమాజానికి సేవ చేయాలి. రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకోవాలి అని పిలుపునిచ్చారు.. ఈ సందర్బంగా ఆయన తనకు సంతోషం కలిగించిన ఒక వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఓ పొలిటిషియన్ రాజమండ్రి దగ్గరకు వెళ్లి నా గురించి తప్పుగా మాట్లాడారు. అక్కడ ఉన్న మహిళ చిరంజీవి గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అని అరిచింది. అప్పుడు ఆమె ఎందుకలా అనిందో నాకు తెలియదు. ఓ మీడియా మిత్రున్ని చిరంజీవి ఆమెకు ఏం చేశాడు అని అడగమని చెప్పాను..


ఆయన ఆమెతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.. అందులో భాగంగా.. మీకు చిరంజీవి ఏదైనా సాయం చేశారా అని అడిగారు. దానికి ఆమె సమాధానం చెబుతూ నా బిడ్డ బ్రతికున్నాడు అంటే దానికి కారణం చిరంజీవినే అని చెప్పింది. డెంగీ వచ్చి బ్లడ్ ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో నా బిడ్డ బతకడని అందరూ అనుకున్నారు. ఓ వ్యక్తి చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి ఫోన్ చేయమని చెప్పారు. నేను బ్లడ్ బ్యాంకు కి సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే దగ్గర్లోని మెగా ఫాన్స్ కి సమాచారం ఇచ్చారు. కొన్ని గంటల్లోనే వాళ్ళు వచ్చి బ్లడ్ ఇచ్చి నా బిడ్డను కాపాడారు అని ఆ మహిళ అన్నది. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను మాట్లాడక్కర్లే, నేను చేసుకున్న మంచే నాకు రక్షణ కవచం అని చిరు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో..మెగా ఫాన్స్ దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పొలిటికల్ రీ ఎంట్రీపై… 

ఇదే స్టేజ్‌పైన రాజకీయాల గురించి కూడా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, అయినా.. కొంత మంది రాజకీయ నాయకలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అలాగే, తాను రాజకీయాలకు వచ్చేది లేదని, తన జీవితం మొత్తం కళామ్మతల్లి  సేవకే అంకితం అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెల్యేగా పోటీపై చిరు స్వీట్ వార్నింగ్  

ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి రాబోయే ఉప ఎన్నికల్లో బంజారాహిల్స్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటూ గాసిప్స్ వచ్చిన  సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు కూడా పలు మీడియా సంస్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరు నేడు చేసిన ఈ కామెంట్స్ ఆ గాసిప్స్ క్రియేట్ చేసిన వారికి కౌంటర్ లా ఉన్నాయని అన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాదు.. అది చిరు స్వీట్ వార్నింగ్ అని కూడా అంటున్నారు.

Also Read : శ్రీముఖికి దిమ్మతిరిగే కౌంటర్.. పెళ్లి కావ్య షాకింగ్ రియాక్షన్..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×