E-Paper
Advertisement

Jangaon Crime: అదే సమస్య.. జీవితంపై విరక్తి, చివరకు దంపతులు ఆత్మహత్య

Jangaon Crime: అదే సమస్య.. జీవితంపై విరక్తి, చివరకు దంపతులు ఆత్మహత్య
Advertisement

Jangaon Crime:  కారణాలు ఏమైనా కావచ్చు.. వచ్చిన కష్టాలను బయటవారితో చెప్పుకునే మనసు కొంతైనా కుదుటపడుతుంది. లేకుంటే రోజు రోజుకూ తీవ్రమై అనేక అనర్థాలకు దారి తీస్తోంది. ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెడుతున్న సందర్భాలు లేకపోలేదు.  తాజాగా అలాంటి ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వారికి వచ్చిన కష్టం ఎవరికీ చెప్పుకోలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

జనగామ జిల్లాలో దారుణం

Advertisement

జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం చిన్నరాంచర్ల గ్రామంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రామ్‌రెడ్డి- లక్ష్మి దంపతులు ఉంటున్నారు.  కొన్నాళ్ల కిందట వీరికి వివాహం జరిగింది.  కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. అప్పుల బాధలు రెట్టింపు అవుతున్నాయి. కానీ ఆదాయం పెరగడం లేదు.

జీవిత కాలం ఈ సమస్య వెంటాడుతుందని భావించారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.  ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దంపతులు పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించే లోపే పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను పొరుగువారు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Advertisement

జీవితంపై విరక్తి చెంది.. దంపతులు ఆత్మహత్య

ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ  ఈ లోకాన్ని విచిడిపెట్టడం చిన్నరాంచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై విచారణ చేపట్టారు.  ఈ దంపతుల గురించి చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నంలో పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా? మరేదైనా కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ALSO READ:  వికారాబాద్‌లో దారుణం.. కత్తితో ఓ వ్యక్తిపై మరొకరు దాడి, అంతా సీసీటీవీ కెమెరాలో

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×