Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) పై దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి, సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్. అపజయమెరుగని దర్శకుడు. ఆయన సినిమాలు భారీ విజయం సాధించడానికి కథ, కంటెంట్, చిత్రీకరణతో పాటు.. సినిమా మేకింగ్ టైమ్‌లో ఎటువంటి లీక్స్ లేకుండా ఉండటం కూడా ఒక కారణం. ఎలాంటి లీక్స్ ఉండకూడదనే, కథ మొత్తం రాజమౌళి ముందే చెప్పేస్తారు. ఆయన చెబితే ఓకే కానీ, ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలలోని నటులెవరూ చిత్రీకరణ టైమ్‌లో సినిమాకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్, ప్రకాష్ రాజ్ గీత దాటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi)లోని తన పాత్ర గురించి ప్రకాష్ రాజ్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్‌పై రాజమౌళి ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.
సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేసే ముందే, తన టీమ్‌కు రాజమౌళి వార్నింగ్ ఇస్తారట. ఈ విషయం స్వయంగా ఆ మధ్య టీమ్ తెలిపింది. సినిమాకు సంబంధించిన ఎటువంటి విషయం, విడుదల వరకు బయటకు రివీల్ చేయవద్దని రాజమౌళి చెబుతాడని.. రీసెంట్‌గా మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో సీన్ ఒకటి లీక్ అవడంతో, టీమ్‌పై ఆయన సీరియస్ అయ్యాడనేలా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు రానివ్వకుండా యూనిట్ చూసుకుంటోంది. అలాంటిది, ప్రకాష్ రాజ్ తాజాగా హాజరైన ఓ వేడుకలో ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నానని చెప్పడమే కాకుండా.. తను చేసే పాత్ర ఏంటో కూడా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది రాజమౌళి వరకు చేరడంతో.. ఆయన ప్రకాష్ రాజ్‌పై సీరియస్ అయినట్లుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
Also Read- Hero Suhas: ‘హే భగవాన్’ టైటిల్ మార్చడానికి కారణం ఏంటంటే?
ప్రకాష్ రాజ్ ‘వారణాసి’ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇందులో తను శివభక్తుడిగా కనిపిస్తానని, జార్జియాలో త్వరలో మొదలుకానున్న షెడ్యూల్‌లో మహేష్ బాబుతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారు. ఇదే రాజమౌళికి కోపం తెప్పించిందట. ఏ చిన్న విషయం బయటకు రివీల్ చేయవద్దని చెప్పినా, ప్రకాష్ రాజ్ ఇలా చెప్పేయడంతో.. ఆయన మరోసారి టీమ్ అందరినీ పిలిచి వార్నింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అడ్వెంచర్ డ్రామాను ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read- Soubin Shahir Movie: ఓటీటీలోకి సౌబిన్ షాహిర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?