E-Paper
Advertisement

Chai Wala: సెన్సార్ దెబ్బకి టైటిల్ మార్చేశారు.. న్యూ టైటిల్ ఇదే!

Chai Wala: సెన్సార్ దెబ్బకి టైటిల్ మార్చేశారు.. న్యూ టైటిల్ ఇదే!
Advertisement

Chai Wala: సెన్సార్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కోలీవుడ్ ఫిల్మ్ ‘జన నాయగన్’ విషయంలో తెలుస్తూనే ఉంది. సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో కూడా ఇప్పుడో సినిమాకు సెన్సార్ అభ్యంతరాలు ఏర్పడ్డాయి. అది స్టార్ హీరో సినిమా కూడా కాదు. ఒక చిన్న హీరో సినిమా. దీంతో ఈ సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేసి, మళ్లీ న్యూ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందుకు టైటిల్ మార్చాల్సి వచ్చింది? అనే విషయాల్లోకి వెళితే.. శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ సినిమాకు కొత్గా ‘నవాబ్ కేఫ్’ (Nawab Cafe) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతున్నారు.

Also Read- Toxic film: మరో వివాదంలో యశ్ టాక్సిక్.. నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు..

సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ

Advertisement

ఈ సినిమా టైటిల్ మార్చడానికి కారణం ఏంటో చిత్ర హీరో శివ కందుకూరి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ‘చాయ్ వాలా’ టైటిల్‌తో జర్నీ చేశాం. టైటిల్‌ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ దగ్గర కూడా ఈ సినిమాకు టైటిల్ అడ్డుపడింది. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం. నా ఫోన్‌లో ప్రమోద్ పేరు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు విధి చివరకు ఆ టైటిల్‌‌నే పెట్టేలా చేసింది. ‘నవాబ్ కేఫ్’ టైటిల్ మా సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా చిత్ర రిలీజ్‌పై ఫోకస్ పెట్టారు.

Also Read- Prakash Raj: మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ అందుకున్న ప్రకాశ్ రాజ్.. ఏకంగా బ్లాక్‌బస్టర్ మూడో భాగంలో..!

మళ్లీ ప్రమోషన్స్ మొదలు..

Advertisement

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తోనే మళ్లీ ప్రమోట్ చేద్దామని టీం అంతా అనుకున్నాం. అందుకే సినిమా విడుదలను ఫిబ్రవరి 20కి వాయిదా వేశాం. ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌గా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఈ సినిమా అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ వాళ్ల నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు. ఫిబ్రవరి 20న ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ఇంత వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన అందరూ అదే సపోర్ట్ కొనసాగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Also Read- Sankranthi 2027: సంక్రాంతికి కర్చీఫ్‌లు సరే.. కథలు సిద్ధమయ్యాయా?

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×