E-Paper
Advertisement

Sankranthi 2027: సంక్రాంతికి కర్చీఫ్‌లు సరే.. కథలు సిద్ధమయ్యాయా?

Sankranthi 2027: సంక్రాంతికి కర్చీఫ్‌లు సరే.. కథలు సిద్ధమయ్యాయా?
Advertisement

Sankranthi 2027: టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే పండగ. అందుకే 2027 సంక్రాంతి (Sankranthi 2027)కి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, అగ్ర హీరోలంతా ఇప్పుడే డేట్ల మీద కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మాస్ ప్రాజెక్ట్, విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి హిలేరియస్ ఎంటర్‌టైనర్, కింగ్ నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాతో రేసులో ఉన్నారు. ఇలా సీనియర్ హీరోలంతా ఒకేసారి పండగ బరిలోకి దిగుతామని ప్రకటనలు గుప్పిస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాల్లో అత్యధికం కేవలం కాంబినేషన్ల మీద ఉన్న క్రేజ్‌తోనే ప్రకటనలు వచ్చాయి తప్ప, ఇప్పటివరకు పక్కాగా సెట్స్ పైకి వెళ్ళింది మాత్రం ఒక్క నాగార్జున సినిమా మాత్రమే.

Also Read- Lokesh Kanagaraj: ‘హెరాల్డ్ దాస్’ కోసం లోకేష్ క్రేజీ ట్వీట్.. ఆల్ ది బెస్ట్ సార్!

సీజన్‌కు తగ్గట్టుగా కథలు ఉన్నాయా? లేదా?

Advertisement

పండగ సీజన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉత్సాహం మేకర్స్‌లో కనిపిస్తున్నప్పటికీ, ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ సినిమాలు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఊగిసలాడుతున్నాయి. కొన్ని సినిమాలకైతే కథలు కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదని, కేవలం లైన్ ఓకే చేసి డేట్స్ లాక్ చేసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగే సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, ఆ సీజన్‌కు తగ్గట్టుగా కథలు ఉన్నాయా? లేదా? అని చూసుకోకుండా కేవలం ‘కర్చీఫ్’ వేశాం కదా అని షూటింగ్ మొదలుపెడితే అది రిస్క్ అనేలా సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో చాలా సినిమాలు కేవలం సంక్రాంతి డేట్ కోసం హడావిడిగా షూటింగ్ పూర్తి చేసి, కంటెంట్ వీక్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయనే విషయం తెలియంది కాదు.

Also Read- Anil Ravipudi: యాక్షన్.. కట్ మీరే చెప్పేయండి.. ఫైనల్లీ తన సినిమాపై అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!

అసలైన సవాల్ ఇదే

Advertisement

ముఖ్యంగా ఈసారి రేసులో ఉన్న దర్శకులంతా గతంలో సంక్రాంతి హిట్లు అందుకున్న వారే కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి వారు తమ తమ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా పక్కా కమర్షియల్ సబ్జెక్టులను సిద్ధం చేయాల్సి ఉంది. కేవలం పండగ సెంటిమెంట్ మీద భారం వేసి, అరకొర కథలతో వస్తే ఈ భారీ కాంబినేషన్లన్నీ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. నాగార్జున ఆల్రెడీ షూటింగ్‌లో వేగం పెంచి సేఫ్ జోన్‌లో ఉండగా, మిగిలిన హీరోలు వచ్చే మార్చి లోపు షూటింగ్ మొదలుపెడితేనే పండగ వరకు అవుట్ పుట్ క్వాలిటీగా వస్తుంది. డేట్లు బుక్ చేసుకోవడం సులభమే కానీ, ఆ డేట్ నాటికి ప్రేక్షకులు మెచ్చే ‘కథ’ను సిద్ధం చేసి వెండితెరపై మ్యాజిక్ చేయడమే ఇప్పుడున్న అసలైన సవాల్. ఈ పోటీలో ఏ కథ నిలబడుతుందో, ఏ కర్చీఫ్ గాలిలో ఎగిరిపోతుందో చూడాలంటే వేచి చూడాల్సిందే. అన్నట్టు శర్వానంద్ వంటి ఒకరిద్దరు యంగ్ హీరోలు కూడా సంక్రాంతిపై కన్నేశారు. ఇవన్నీ ఇలా ఉంటే, రాబోయే సంక్రాంతికే పవన్ కళ్యాణ్ – సూరి ప్రాజెక్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రం పట్టాలెక్కలేదు కానీ, సంక్రాంతికే అనేలా టాక్ అయితే బయటకు వచ్చింది. చూద్దాం.. మరి ఫైనల్‌‌గా సంక్రాంతి బరిలో ఎన్ని చిత్రాలు ఉంటాయో.. ఏయే చిత్రాలు ఉంటాయో?

Also Read- Ranveer Singh: రణవీర్ సింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×