E-Paper
Advertisement

Prakash Raj: మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ అందుకున్న ప్రకాశ్ రాజ్.. ఏకంగా బ్లాక్‌బస్టర్ మూడో భాగంలో..!

Prakash Raj: మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ అందుకున్న ప్రకాశ్ రాజ్.. ఏకంగా బ్లాక్‌బస్టర్ మూడో భాగంలో..!
Advertisement

Prakash Raj:  దేశవ్యాప్తంగా భారీ ప్రేక్షకాదరణ పొందిన దృశ్యం సినిమా సిరీస్ ఇప్పుడు మూడో భాగానికి చేరుకుంది. తాజాగా దృశ్యం 3 సినిమా నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఒక కీలక నటీనటుల అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎంపికైనట్లు సమాచారం.

ముందుగా ఈ విలన్ పాత్ర కోసం మరో నటుడిని అనుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ చేయనున్నారని తెలుస్తోంది. దృశ్యం కథలో ప్రతినాయకుడి పాత్ర చాలా కీలకం. హీరో విజయ్ సాల్గావ్‌కర్‌ను మానసికంగా, వ్యూహాత్మకంగా ఎదుర్కొనే పాత్ర అది. అలాంటి బలమైన పాత్రకు ప్రకాశ్ రాజ్ సరైన ఎంపిక అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

ప్రకాశ్ రాజ్ అంటేనే గంభీరమైన నటన, సహజత్వం. అతి లేకుండా, మాటలకంటే చూపులతోనే భావాలను చెప్పగల నటుడు ఆయన. అందుకే ఈ పాత్రలో ఆయన కనిపిస్తే కథకు మరింత బలం చేకూరుతుందని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఎంపికపై పాజిటివ్ స్పందన వస్తోంది.

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ మళ్లీ అజయ్ దేవగన్తో కలిసి నటించనున్నారు. వీరిద్దరూ దాదాపు 15 సంవత్సరాల క్రితం సింగం సినిమాలో కలిసి కనిపించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకే సినిమాలో నటించడం ప్రేక్షకులకు నాస్టాల్జియా ఫీలింగ్ ఇస్తోంది. ఈ కాంబినేషన్ మరోసారి తెరపై ఎలా మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇటీవల ప్రకాశ్ రాజ్ కెరీర్ చాలా బలంగా కొనసాగుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి, అలాగే సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్ వంటి పెద్ద ప్రాజెక్టుల్లో ఆయన భాగం కావడం విశేషం. ఇప్పుడు దృశ్యం 3లో కీలక పాత్ర దక్కడంతో ఆయన కెరీర్‌లో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా మారింది.

బహుభాషా చిత్రాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ప్రకాశ్ రాజ్, ఈసారి దృశ్యం 3లో ప్రతినాయకుడిగా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతుండగా, విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Devi Sri Prasad: ఒకప్పుడు నెంబర్ వన్… ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూపులు..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×