E-Paper
Advertisement

Toxic film: మరో వివాదంలో యశ్ టాక్సిక్.. నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు..

Toxic film: మరో వివాదంలో యశ్ టాక్సిక్.. నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు..
Advertisement

Toxic Film: కేజిఎఫ్ స్టార్ యశ్ (Yash)హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్(Toxic). గీతు మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కే జి ఎఫ్ 2 ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పిన యశ్ మరోసారి ఇండస్ట్రియల్ రికార్డులను బ్రేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది మార్చి 19వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా చుట్టూ వివాదాలు నెలకొన్నాయి.

షూటింగ్ కోసం వేలాది చెట్లు నరికివేత..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు రావడమే కాకుండా మహిళా కమిషన్ వరకు ఈ వ్యవహారం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం నుంచి బయటపడిన చిత్ర బృందం మరొక వివాదంలో చిక్కుకున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కోసం అడవులను మొత్తం నాశనం చేశారు అంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో చిత్ర నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు కావటం గమనార్హం. బెంగళూరులోని పీన్య, జలహళ్లి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది అయితే ఈ షూటింగ్ కోసం అటవీశాఖ అధికారుల పరిమితి లేకుండా వేలాది చెట్లను నరికివేశారు.

టాక్సిక్ నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్..

Advertisement

ఇలా పెద్ద ఎత్తున చెట్లను నరికి వేయడంతో ఈ విషయంపై అటవీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై అటవీశాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెట్లను నరికి వేశారనే ఆరోపణలు నిజమని కర్ణాటక అటవీశాఖ తేల్చడంతో నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదేవిధంగా షూటింగ్ యూనిట్ తో పాటు భూమిని లీజుకు ఇచ్చిన వ్యక్తులపై కూడా కేసులో నమోదు చేసినట్టు సమాచారం.

టాక్సిక్ ను చుట్టు ముట్టిన వివాదాలు..

Advertisement

ఇలా మరోసారి చిత్ర నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడంతో ఈ సినిమా విడుదల సాధ్యమేనా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం ఉందనగా ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ సమస్య పరిష్కారం కాకముందే నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడంతో ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విషయంపై చిత్ర నిర్మాతల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Rowdy Janardhan: విజయ్ రౌడీ జనార్ధన్ లో స్టార్ హీరో.. ఇది అసలు ఊహించలేదుగా?

Related News

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×