E-Paper
Advertisement

Harley-Davidson: చిన్న షెడ్డు నుంచి ప్రపంచ యుద్ధాల దాకా, హార్లే-డేవిడ్సన్ చరిత్ర మామూలుగా లేదు భయ్యా!

Harley-Davidson: చిన్న షెడ్డు నుంచి ప్రపంచ యుద్ధాల దాకా, హార్లే-డేవిడ్సన్ చరిత్ర మామూలుగా లేదు భయ్యా!
Advertisement

Harley Davidson Success Story: హార్లే-డేవిడ్సన్ (Harley-Davidson).. ప్రసిద్ధ అమెరికన్ మోటార్‌ సైకిల్ బ్రాండ్. ప్రపంచంలో అత్యంత ఐకానిక్ బైకులకు కేరాఫ్. ఈ కంపెనీ 120 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. మోటార్‌ సైకిల్ కల్చర్‌ను పూర్తి మార్చివేసింది కూడా. ఇంతకీ ఈ సంస్థ ఎలా ప్రారంభం అయ్యింది? ఇంత గొప్ప కంపెనీగా ఎలా ఎదిగింది? సహా పలు ఆసక్తికర  విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1903లో పునాది రాయి!

హార్లే-డేవిడ్సన్ 1903లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో స్థాపించబడింది. విలియం S. హార్లే (William S. Harley), ఆర్థర్ డేవిడ్సన్ (Arthur Davidson) అనే ఇద్దరు మిత్రులు కలిసి తొలి మోటార్‌ సైకిల్‌ ను ఒక చిన్న షెడ్‌లో తయారు చేశారు. ఆ తర్వాత ఆర్థర్ సోదరులు వాల్టర్, విలియం డేవిడ్సన్ కూడా వీరితో జాయిన్ అయ్యారు. అందిరి పేర్లు కలిసేలా తమ కంపెనీకి హార్లే- డేవిడ్సన్ అనే పేరు పెట్టారు. 1905లో వారి ప్రోటోటైప్ బైక్ చికాగోలో 15 మైల్ రేస్‌ లో ఫస్ట్ ప్లేస్ సాధించింది. అదే సంవత్సరం 8 మోటార్‌ సైకిళ్ల మాస్ ప్రొడక్షన్ ప్రారంభమైంది.

ప్రపంచ యుద్ధాలలో కీలక పాత్ర

Advertisement

హార్లే-డేవిడ్సన్ ప్రపంచ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో (WWI)  15 000కు పైగా బైక్‌లను మిలిటరీకి సప్లై చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం (WWII)లో  సుమారు 90,000 బైక్‌లను మిలిటరీకి అందించింది. ఆ తర్వాత ఈ బైక్స్ కు సైనికుల నుంచి మరింత ఆదరణ దక్కింది. ఈ కంపెనీ బైక్ ఫ్రీడమ్ సింబల్‌ గా మారింది. 1930లో గ్రేట్ డిప్రెషన్‌ను సర్వైవ్ చేసిన కొన్ని మోటార్‌సైకిల్ కంపెనీలలో ఇది ఒకటి. 1969లో AMF కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. కానీ 1981లో మళ్లీ ఇండిపెండెంట్ అయింది. ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్‌గా విస్తరించింది, 2025 నాటికి ఎలక్ట్రిక్ మోడల్స్(లైవ్‌వైర్) కూడా లాంచ్ చేసింది.

హార్లే-డేవిడ్సన్ గురించి ఆసక్తికర విషయాలు

⦿  హార్లే-డేవిడ్సన్ 1904లో మొదటి షోరూమ్ ఓపెన్ చేసింది. మొదటి బైక్ 200 డాలర్లకు అమ్మింది.

Advertisement

⦿ ప్రస్తుతం అమెరికాతో పాటు బ్రెజిల్,భారత్, థాయ్‌లాండ్ లాంటి దేశాలలో ఫ్యాక్టరీలు ఉన్నాయి.

⦿ మిలిటరీ రోల్: WWIలో మెసెంజర్ బైక్‌లుగా ఉపయోగపడ్డాయి. WWIIలో WLA మోడల్ లిబరేటర్ గా పిలువబడింది.

⦿ కల్ట్ స్టేటస్: హాలీవుడ్ మూవీలు,  రాక్ స్టార్స్ ద్వారా పాపులర్ అయింది.

⦿ హార్లే-డేవిడ్సన్ మోటార్‌ సైకిల్ ప్రేమికులకు ఒక లెజెండ్.

⦿ ఈ కంపెనీ మోటార్ సైకిళ్లతో పాటు బోట్లు (Tomahawk boats, 1960ల వరకు), గోల్ఫ్ కార్ట్‌లు, స్కూటర్ (Topper), త్రివీలర్స్ (Servi-Car, 1932-1973)తో పాటు సైకిళ్లను కూడా తయారు చేసింది.

⦿ 1921లో Otto Walker హార్లే మీద 100 mph (సుమారు 160 కి.మీ/గం) సగటు స్పీడ్‌తో రేస్ గెలిచాడు. అప్పట్లో ఇది రికార్డు!

⦿ హార్లే-డేవిడ్సన్  గ్రేట్ డిప్రెషన్ సర్వైవల్ గా నిలిచింది. 1930ల ఆర్థిక మాంద్యంలో అమెరికాలో మిగిలిన రెండు మోటార్‌సైకిల్ కంపెనీలలో (Indianతో పాటు) హార్లే మాత్రమే సర్వైవ్ అయ్యింది.

Read Also: ప్రపంచంలో అతిపెద్ద, అతిచిన్న కార్లు ఇవే.. చూడ్డానికి భలే ఉన్నాయే!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×