E-Paper
Advertisement

Champion Collections : ‘ఛాంపియన్’ క్లోజింగ్ కలెక్షన్స్.. అన్ని కోట్లు రాబట్టడం గ్రేటే మరి..!

Champion Collections : ‘ఛాంపియన్’ క్లోజింగ్ కలెక్షన్స్.. అన్ని కోట్లు రాబట్టడం గ్రేటే మరి..!
Advertisement

Champion Collections : శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. గతంలో ఈ హీరో తీసిన రెండు సినిమాల్లో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడొచ్చిన మూడో సినిమా ఛాంపియన్. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ దాక్కున అందుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం భారీగానే వసూలు చేసింది.. గత ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమా ఒకటి. మొదటినుంచి సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పర్వాలేదని టాక్ అందుకున్న ఏ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ మాత్రం భారీగానే వసూలు అయ్యాయి. ఈ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘ఛాంపియన్’ క్లోజింగ్ కలెక్షన్స్..

రోషన్ మేక, అనశ్వర రాజన్ జంటగా నటించిన తాజాగా చిత్రం ఛాంపియన్. రిలీజ్ కు ముందు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. ఇందులోని గిరగిర సాంగ్ మాత్రం ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంది. మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఎవరెస్టాకు దక్కింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన స్టోరీ కావడంతో జనాలు పెద్దగా ఆదరించలేదు. చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తుందని విడుదల రోజు అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టింది.. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందంటే.. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.. మొత్తానికి సినిమాకు నష్టాలు లేకుండా బాగానే రాబట్టింది..

Advertisement

Also Read :మహా కోసం ఇంట్లో టెన్షన్.. భూషణ్ కు షాకిచ్చిన హారిక.. చక్రి, మహా దొరుకుతారా..?

మూవీ బడ్జెట్& టార్గెట్..? 

ఛాంపియన్ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 11 కోట్ల రూపాయలకు జరిగింది.. కమర్షియల్ గా చూస్తే యావరేజ్ రేంజ్ లో ఆడింది అని చెప్పొచ్చు.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వగా, కోవై సరళ, కేకే మీనన్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్ వంటి నటీనటులు ఇందులో నటించారు.. జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమాకు దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. కానీ లాభాల్లోకి రావాలంటే సుమారు 23 కోట్ల రూపాయల షేర్, 46 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువ. ఇక రోషన్ గతంలో నటించిన పెళ్లి సందడి సినిమాకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ రోషన్ లాంటి హీరో ఇలాంటి సినిమాలు చేసే కన్నా యూత్ని ఆకట్టుకునే సినిమాలు చేస్తే మాత్రం ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకముందు రోషన్ ఎలాంటి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తాడో చూడాలి..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×