E-Paper
Advertisement

Ysrcp Politics: వైసీపీకి కొత్త కష్టాలు.. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం

Ysrcp Politics: వైసీపీకి కొత్త కష్టాలు.. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం
Advertisement

Ysrcp Politicsవైసీపీకి ఎమ్మెల్యేలకు పదవీ గండం పొంచివుందా? అసెంబ్లీకి హాజరుకాకుండా జీతం తీసుకుంటున్నారా? ఆ విధంగా చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ గుర్తించిందా? వారికి రేపో మాపో నోటీసులు ఇవ్వాలని భావిస్తోందా? కమిటీ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement

వైసీపీకి కొత్త కష్టాలు.. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు?

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడిచింది. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతామని ఆ పార్టీ అధినేత భీష్మించుకుని కూర్చొన్నారు. ఈ వ్యవహారంపై చివరకు న్యాయస్థానం తలుపు తట్టారు కూడా.

మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు ఎవరూ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని తేల్చి చెప్పేవారు. ఈ అంశంపై పదే పదే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెబుతున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం వినిపించు కోలేదు. ఈ విషయంలో జగన్ దారిలోనే మిగతా ఎమ్మెల్యేలు నడుస్తున్నారు.

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ నిర్ణయం?

అమరావతిలో బుధవారం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీకి రాకుండా వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకున్నట్లు అధికారులు ఈ కమిటీ దృష్టికి తెచ్చారు. ఆ విషయాన్ని పరిశీలించిన ఎథిక్స్ కమిటీ, ఇది ముమ్మాటికీ సభా మర్యాదలను ఉల్లఘించడమే అవుతుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిబంధనలు ఉల్లఘించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ భావిస్తోంది. దీనికి సంబంధించి నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది. రేపో మాపో ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనుంది. వారి నుంచి వివరణ తీసుకోనుంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు, చివరిరోజు పొటెత్తిన భక్తులు

ఈ విషయంలో మాజీ సీఎం జగన్ జీతం తీసుకోలేదని స్పీకర్ స్వయంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. పార్టీ మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించినప్పుడు సాంకేతిక అంశాలు కీలకంగా మారుతాయి. వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకుంటే వారి సభ్యత్వంపై వేటు పడే అవకాశముంది.

ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకోనున్నారు. అదే జరిగితే ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. అదే జరిగితే వైసీపీ కోలుకోలేని దెబ్బ తగులుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు అడుగులు వేసిందని అంటున్నారు. జగన్ రాకపోయినా మిగతా ఎమ్మెల్యేలు పంపించినా బాగుండేదని అంటున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×