E-Paper
Advertisement

Chandini Chowdary: ఎలాంటి సమాజంలో ఉన్నాం.. కుక్కలను అలా చేస్తారా? చాందినీ చౌదరి ఫైర్

Chandini Chowdary: ఎలాంటి సమాజంలో ఉన్నాం.. కుక్కలను అలా చేస్తారా? చాందినీ చౌదరి ఫైర్
Advertisement

Chandini Chowdary About Stray Dogs: హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది. కలర్ ఫోటోతో లైమ్ లైట్లోకి వచ్చిన చాందిని ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తి అనే సినిమాతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఇంత దారుణమా..

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఒక వీడియో షేర్ చేసింది. కార్ షో రూం ముందు కొందరు వీధి కుక్కలను పట్టుకుని తీసుకువెళుతున్నారు. అయితే ఇక్క కుక్కను బంధించిన ట్రాలీలో ఎక్కిస్తున్న క్రమంలో దాన్ని కింద నుంచి పైకి విసురుతున్నారు. అందులో పట్టక కుక్క పై నుంచి కింద పడిపోతుంది. బ్రతికి ఉన్న ఆ కుక్కను ఓ వస్తువులా ట్రీట్ చేస్తూ నిర్లక్ష్యంగా దాన్ని పైకి విసరడం చేస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ చాందిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఎలాంటి సమాజంలో ఉన్నాం..

’నోరు లేని జీవాల పట్ల ఇంతటి అమానుషం. అవి కూడా మనలాగే ప్రాణులనే విషయాన్ని కూడా మరిచిపోయారు. వాటిని అలా విసరడం ఎంత ఘోరమైన చర్య. వాటికి హాని కలుగుతుందనే కనీసం ఆలోచన కూడా లేకుండ విచక్షరహితంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం జంతువుల పట్ల జాలి, దయ లేని సమాజంలో మనం జీవిస్తున్నాం’ అంటూ తన పోస్టుకు రాసుకొచ్చింది. అయితే ఈ సంఘటన విశాఖపట్నంలోని వరుణ్ మోటార్ ముందు జరిగినట్టు వెల్లడించింది. విశాఖపట్నం మున్సిపాలిటి అధికారులను దీన్ని కాస్తా గమనించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Also Read: Dharmendra Health: ధర్మేంద్రకు తీవ్ర అస్వస్థత.. బాబీ డియోల్, సన్నీ డియోల్ భావోద్వేగం.. వీడియో వైరల్

చాందినికి చురకలు

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కార్లల్లో తిరిగే మీకు వీధి కుక్కలు వల్ల కలిగే హాని గురించి మీకేంత తెలుసు? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాటి కారణంగా ఎంతో బాటసారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదం బారిన పడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారందరికి చాందిని చౌదరి తనదైన సమాధానం తిప్పి కొడుతుంది. అయితే అన్ని వీధి కుక్కలు ఒకలా ఉండవంటూ ఆమెకు చురకలు అంటిస్తున్నారు. కాగా సినీ సెలబ్రిటిల్లో జంతు ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. సమాజంలో ఎక్కడ జంతువుల పట్ల జరిగే అమానుష ఘటనలపై తరచూ ఎవరో ఒకరు స్పందిస్తుంటారు. ఇటీవల వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నటి సదా, యాంకర్ రష్మితో పాటు ఎంతో జంతు ప్రేమికులు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×