E-Paper
Advertisement

Anasuya: SSMB 29 షూటింగ్ లొకేషన్ లో అనసూయ.. ఏకంగా వారితో కలిసి!

Anasuya: SSMB 29 షూటింగ్ లొకేషన్ లో అనసూయ.. ఏకంగా వారితో కలిసి!
Advertisement

Anasuya:యాంకర్ కం నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj).. జబర్దస్త్ (Jabardasth) ద్వారా యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడంతో సినిమాల్లోకి వచ్చేసింది. అలా రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని రంగమ్మత్త అనే కీలకపాత్రలో అనసూయ నటించింది. ఈ పాత్ర ద్వారా అనసూయ చాలా పాపులర్ అయింది. ఈ పాత్రకి అనసూయ 100% న్యాయం చేసింది. అలా ఒకే ఒక్క సినిమాతో అనసూయ కెరియర్ మలుపు తిరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత అనసూయకి ఎన్నో సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా పుష్ప సినిమాలో ద్రాక్షాయిణి అనే నెగటివ్ రోల్ కూడా పోషించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించింది.

ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ లో సందర్శించిన అనసూయ..

అలా వరుస సినిమాలు చేస్తూ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ జరిగిన చోటుకి వెకేషన్ కి వెళ్ళింది. అదే ఎస్ఎస్ఎంబి 29.. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించి రీసెంట్ గానే విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి సంబంధించి కుంభ రోల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే నవంబర్ 15న గ్లోబ్ ట్రోటర్ పేరుతో రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద ఈవెంట్ ని చేస్తున్నారు. ఇందులో ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించి టైటిల్ గ్లింప్స్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా అనసూయ ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ జరిపిన ప్రసిద్ధ మసాయి మారా రిజర్వ్ ఫారెస్ట్ లో విహరిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఫోటోలు వైరల్..

Advertisement

అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కెన్యా వెకేషన్ ట్రిప్ కి వెళ్ళింది. ఇండస్ట్రీలో ఎక్కువగా ఫ్రెండ్స్ లేని అనసూయ ఏకాస్త సమయం దొరికినా తన కుటుంబంతోనే గడుపుతుంది. అలా తాజాగా కెన్యా వెకేషన్ ట్రిప్ కి వెళ్ళిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో అనసూయ భరద్వాజ్.. తన భర్తతో కలిసి అడవిలోని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ.. ఉన్న ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది. అయితే ఫ్యామిలీ మొత్తంతో వెకేషన్ కి వెళ్ళినప్పటికీ అడవిలోకి మాత్రం కేవలం తన భర్త అనసూయ మాత్రమే వెళ్ళిన ఫొటోస్ కనిపిస్తున్నాయి.

తెగ ఎంజాయ్ చేస్తున్న అనసూయ..

కెన్యాలో ఉన్న అడవి అందాలతోపాటు అక్కడి వింతైన జంతువులని చూస్తూ అనసూయ తెగ ఎంజాయ్ చేస్తోంది . అంతేకాకుండా కెన్యాలోని కరూర అడవిలో ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వాటర్ ఫాల్స్ తో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. అలాగే అడవి మధ్యలో అనసూయ భర్తతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనసూయ అభిమానులు ఈ ఫోటోలకు హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు..

Advertisement

ALSO READ:Jolly LLB 3: ఓటీటీలోకి అక్షయ్ లీగల్ కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

 

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×