E-Paper
Advertisement

Babu Mohan: జంబలకిడిపంబతో ఆ కల నెరవేరింది.. బాబు మోహన్ కామెంట్స్

Babu Mohan: జంబలకిడిపంబతో ఆ కల నెరవేరింది.. బాబు మోహన్ కామెంట్స్
Advertisement

Babu Mohan Emotional: నటుడు కమెడియన్ బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తరం కంటే 90 ఆడియన్స్ ఆయన బాగా సుపరిచితం. ఒకప్పుడు సినిమాల్లో విలన్ గా కమెడియన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దివంగత నటుడు కోట శ్రీనివాస్, బాబు మోహన్ కాంబో సూపర్ హిట్. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సీన్స్ సినిమాకే హైలెట్ అనడంతో అతిశయోక్తి లేదు. అయితే వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లోనూ వీరిద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. 

నటన పక్కన పెట్టి రాజకీయాలపై..

Advertisement

ప్రస్తుతం ఆయన సినిమాలు పక్కన పెట్టి పూర్తి రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. బీజేపీలో యాక్టివ్ గా ఉన్న బాబు మోహన్ ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు రోడ్డు బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ యువతకు సూచన చేశారు. సినిమాలు చూసి యూత్ బైక్ రైడ్స్ అంటూ ఓవర్ స్పిడ్ తో వెళుతూ జీవితాన్ని పొగోట్టుకుంటున్నారని, దానివల్ల వారి జీవితం పోవడమే కాదు కుటుంబ సభ్యులకు తీరని శోకం ఇస్తుంది.

ఎంతో మందిని నవ్వించా.. కానీ

ఎంతో మందిని నవ్వించిన నేను నా కొడుకు మరణం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నా అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనేది నా కల. కానీ అనుకోకుండ నటుడిని అయ్యాను. జంబలకిడిపంబ సినిమాలో పోలీసు పాత్ర చేశాను. దానితో నా కల నేరవేరింది. చిల్డ్రన్స్ డే రోజు స్టూడెంట్స్ తో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. యువత సినిమాలు చూసి హీరోలా వాహనాలు నడపకండి. వాహనాలు నడిపేటప్పుడు తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. మీ తలితండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు.

Advertisement

Also Read: Vaishanv Tej: ఎట్టకేలకు ఈ మెగా హీరోకి డైరెక్టర్ దొరికేశాడు.. ఇంతకి రౌడీ ముందా? వైష్ణవ్ ముందా?

మా ఇద్దరి కొడుకులను పోగొట్టుకున్నాం..

మా కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చెన్నైలో లో ఇంజనీరింగ్ చదువుతూ బైక్ కొనుకున్నాడు. ఆ ఆనందంలో ఫిలింనగర్ లో బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సినిమాలతో వెండితెరపై ఎంతో మందిని నవ్వించిన నేను నిజం జీవితంలో కోలుకోలేని బాధలో ఉండిపోయాను. నా కొడుకు మృతి ఇప్పటికీ నన్నూ బాధిస్తూనే ఉంది. నా స్నేహితుడు, దివంగత నటుడు కోట శ్రీనివాస్ కొడుకు కూడా రోడ్డు ఆక్సిడెంట్ లోనే చనిపోయాడు. మేమిద్దరం కలిసినప్పుడల్లా మా కొడుకులను తలుచుకుని బాధ పడేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

Big Stories

Advertisement
×