E-Paper
Advertisement

పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ సీన్ రివర్స్ … ఈసారి తప్పించుకోలేరా?

పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ సీన్ రివర్స్ … ఈసారి తప్పించుకోలేరా?
Advertisement

Puri Jagannadh:పూరీ జగన్నాథ్ .. ఈ పేరు చెబితే చాలు సినిమాలు సొల్డ్ అవుట్ అయిపోయేవి. సిల్వర్ స్క్రీన్ పై ఈయన పేరు పడితే చాలు ఆడిటోరియం హౌస్ ఫుల్స్ అయ్యేవి. అలాంటి పూరి కి గత నాలుగేళ్లుగా కాలం అస్సల్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం ఈయన గ్రాప్ చూస్తుంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన పూరి ఇతనేనా అన్న డౌట్స్ రాక మానవు.ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా ఆగస్టు 25, 2022న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ‘లైగర్’ సినిమా పూరీ ఇమేజ్‌ను ఫుల్ డ్యామేజ్ చేసేసింది. ఈ సినిమా కేవలం డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా నిలువునా ముంచేసింది.

‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా మెడకి

Advertisement

ఇక ఆ సమయంలోనే సినిమా కొని నష్టపోయిన బయ్యర్లకు కొంత డబ్బుని వెనక్కి ఇస్తానని ప్రామిస్ చేసి రెండేళ్ళు దాటినా కూడా నిలబెట్టుకోలేదన్న విమర్శ ఉంది. ఇక అది అలా ఉండగానే ఆగస్టు 15, 2024న ‘డబుల్ ఇస్మార్ట్’తో మళ్ళీ తన లక్ టెస్ట్ చేసుకున్న పూరి అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్లకు మొండి చెయ్యే చూపాడని సమాచారం.ఇక ఆ రెండు సినిమాల డిస్ట్రిబ్యూషన్ పంచాయితీ ఇపుడు లేటెస్ట్ గా పూరి తీసిన ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా మెడకి చుట్టుకున్నట్టు తెలుస్తుంది.

also read:నలుగురు మొనగాళ్లు.. ఒకే సీజన్… 2027 సమ్మర్ వార్ లో నిలిచేదెవరు?

Advertisement

తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల  అల్టిమేటం జారీ

ప్రస్తుతం ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్న ఈ టైమ్ లో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఒక అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తుంది. ‘లైగర్’ మరియు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలకి సంబందించిన దాదాపు రూ. 5 కోట్లు సెటిల్మెంట్ చేస్తే కాని ‘స్లమ్ డాగ్’ థియేటర్ల లోకి వచ్చేందుకు ఒప్పుకోమని తేల్చి చెప్పారట.మరో వైపు ఈ ఇష్యూ సెటిల్ చేసుకుంటే కాని సినిమాని కొనలేమంటూ డిజిటల్ ఫ్లాట్ పామ్స్ క్లారిటీ ఇచ్చాయట. అంటే ప్రస్తుతం పూరి పరిస్థితి కక్కా లేక మింగా లేక అన్నట్టుగా ఉందన్న మాట.

విజయ్ సేతుపతి లాంటి స్టార్ పవర్ ఉందని 

ఒకప్పుడు పూరీ సినిమా అంటే ఎగబడి కొనేవారు, ఇప్పుడు మాత్రం ఆయన పేరు చెబితేనే బయ్యర్లు భయపడే పరిస్థితి. ఇక ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ చూస్తుంటే ‘స్లమ్ డాగ్’ రిలీజ్ ఇప్పట్లో అవడం కష్టంగానే కనిపిస్తుంది.కనీసం పూరి ఇప్పటికైనా స్వయంగా ఇష్యూ లోకి ఎంటర్ అయి ఆ పాత బాకీలను క్లియర్ చేస్తేనే ఆయన క్రెడిబిలిటీ కాస్తో కూస్తో నిలబడుతుంది. అలా కాకుండా విజయ్ సేతుపతి లాంటి స్టార్ పవర్ ఉంది కదా అని రిస్క్ చేసి ముందుకెళితే మాత్రం థియేటర్లు దొరకడం చాలా కష్టం.రీసెంట్ గా బాలయ్య అఖండ2 రిలీజ్ ఇష్యూ లో ఏమైందో మనకు బాగా గుర్తుంది కూడా. చూడాలి మరి 5 కోట్లు చెల్లించి సమస్యని సాల్వ్ చేసుకుంటాడా.. లేక అలాగే మంకు పట్టి ఇష్యూని మరింత జటిలం చేసుకుంటాడా!

also read:స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్.. ‘పెద్ది’కి అదిరిపోయే గ్లామర్ టచ్!

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×