Charan Arjun:తెలంగాణ మట్టి నుంచి వచ్చి తన పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, లిరిసిస్ట్ చరణ్ అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని బాధని బయటపెట్టారు. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ఎన్నో పాటలు చేసినా రావాల్సిన గుర్తింపు రాకపోవడం, చేతికి వచ్చిన సినిమా అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం గురించి మాట్లాడారు. కొంతమంది దగ్గరి మిత్రుల నుండి ఎదురైన అనుభవాలు, మంగ్లీ తనకు ఎంతగా సాయం చేసిందో చెప్పుకొచ్చారు.
మూడు పాటలు చేయించుకుని.. మరో మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకున్నారా?
సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ దర్శకుడు వేణు ఉడుగుల ‘విరాట పర్వం’ సినిమా కోసం తనతో మూడు పాటలు చేయించుకున్నారని, ఆ తర్వాత మరో సంగీత దర్శకుడితో కమిట్ అయ్యాడని కాని కనీసం నాతో ఒక మాట కూడా చెప్పలేదని బాధ పడిపోయాడు.
పదేళ్ల స్నేహం ఉన్నా.. ‘ఇడుపు కాయితం’లో అవకాశం రాలేదు
దర్శకుడు వంశీ కృష్ణతో తనకు దాదాపు పదేళ్ల స్నేహం ఉందని చరణ్ అర్జున్ తెలిపారు. తన మొదటి సినిమాకు కూడా తానే పనిచేశానని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ, వంశీ కృష్ణ తెరకెక్కించిన ‘ఇడుపు కాయితం’ సినిమాకు సంగీత దర్శకుడిగా తనకు అవకాశం దక్కలేదని బాధపడ్డారు.
మంగ్లీ మాత్రం అలా కాదు.. అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి సాయం చేస్తుంది
ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూనే చరణ్ అర్జున్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తన దృష్టిలో మంగ్లీ ఎంతో మంచి మనిషి అని ప్రశంసించారు. ఆమెపై ఎన్ని విమర్శలు వచ్చినా తాను వాటిని పట్టించుకోనని చెప్పారు.
తనకు అర్ధరాత్రి సమయంలో కూడా ఏదైనా సహాయం అవసరమైతే మంగ్లీ వచ్చి సాయం చేస్తుందని వివరించారు. కొంతమంది ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, తాను తెలంగాణకు చెందినవాడినని చెబుతూ, ఆమెకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నావని అడిగేవారని ,అయితే, ప్రాంతాలు తనకు ముఖ్యం కాదని, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు అండగా నిలబడుతున్నారన్నదే ముఖ్యమని ఆయన అభిప్రాయాన్ని బయటపెట్టారు.
ఇక మంగ్లీ ‘గరివిడి లక్ష్మి’ సినిమా కోసం రెండు పాటలను ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పాడిందని . తనకు అవసరమైన సమయంలో అండగా నిలవడంతో పాటు, సినిమా కోసం డబ్బు తీసుకోకుండా పాటలు పాడటం మంగ్లీ మంచితనం అని ఆకాశానికి ఎత్తారు.
చూడాలి మరి చరణ్ అర్జున్ చేసిన ఈ కామెంట్స్ పై వేణు ఉడుగుల, వంశీ ఎలా రియాక్ట్ అవుతారో !
ALSO READ :పాటలకు లక్షల్లో వ్యూస్.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ..చరణ్ అర్జున్ ఆవేదన!