E-Paper
Advertisement

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ
Advertisement

Horror Movie OTT : కుటుంబ సభ్యులతో కలిసి గడిపి, భర్తను కోల్పోయిన బాధ నుంచి కాస్త బయటపడాలని ఓ మహిళ అత్తింటికి వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు ఊహించని విధంగా మారిపోతాయి. శాపగ్రస్తమైన పుస్తకం నుంచి విడుదలైన దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ఆవహిస్తే? నిన్నటి వరకు ఆప్యాయంగా ఉన్నవారే ప్రాణాలు తీసేందుకు వెంటపడితే? అత్తింట్లో సేదతీరాలనుకున్న ఆమె ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. ఇలాంటి భయానక దృశ్యాలు, రక్తపాతం, ప్రాణాల కోసం పోరాటంతో సాగే హారర్‌ చిత్రం ‘ఈవిల్‌ డెడ్‌ బర్న్‌’ (Evil Dead Burn). మరి ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడొచ్చు ? ఎన్ని ఓటీటీలలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

అలీస్‌ తన భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంటుంది. ఆ బాధ నుంచి బయట పడేందుకు, ఒంటరితనాన్ని మర్చిపోయేందుకు భర్త కుటుంబ సభ్యులను కలవాలని నిర్ణయించుకుంటుంది. దీంతో మారుమూల ప్రాంతంలో ఉన్న అత్తింటికి వెళ్తుంది. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపొచ్చని భావిస్తుంది. కానీ ఆమెకు అక్కడ ఊహించని షాక్ తగులుతుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించిన దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ఆవహించడం మొదలు పెడుతుంది. దాని ప్రభావానికి గురైనవారు సాధారణ మనుషుల్లా ప్రవర్తించరు. భయంకరమైన రూపాల్లోకి మారి, ఎదుటివారిపై దాడి చేస్తుంటారు.

Advertisement

దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి గడపాల్సిన సమయం కాస్తా ప్రాణాల కోసం పోరాడే భయానక పరిస్థితిగా మారిపోతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో అర్థంకాని పరిస్థితి అలీస్‌కు ఎదురవుతుంది. ఇక్కడ అలీస్‌ ఎదుర్కొనే ప్రమాదం కేవలం దుష్టశక్తి దాడులతోనే ముగియదు. తనకు దగ్గరైనవారే దాని ప్రభావానికి గురవుతుండటంతో, వారిని కాపాడాలా ? లేక తన ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకోవాలా ? అనే పరిస్థితిలో చిక్కుకుంటుంది.

మరి అలీస్‌ తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతుందా ? దుష్టశక్తి నుంచి బయట పడేందుకు ఆమె ఎలాంటి పోరాటం చేయాల్సి వస్తుంది ? భర్తకు ఇచ్చిన వాగ్దానాలు చివరకు ఆమెకు ఎలా ఉపయోగపడతాయి ? అనేవి కథలోని ప్రధాన అంశాలు. కుటుంబ బంధాలను భయానక శక్తులతో ముడిపెట్టి, రక్తపాతంతో కూడిన ఉత్కంఠభరితమైన థ్రిల్ అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Advertisement

Also Read : మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్

‘ఈవిల్‌ డెడ్‌ బర్న్‌’ జీ5 (ZEE5)లో అద్దెకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇండియాలో అందుబాటులో లేదు. ఈ హర్రర్ సినిమాలో సౌహేలా యాకూబ్‌ (Souheila Yacoub), టాండి రైట్‌ (Tandi Wright), హంటర్‌ డూహన్‌ (Hunter Doohan), లూసియాన్‌ బుకానన్‌ (Luciane Buchanan) తదితరులు నటించారు. సెబాస్టియన్‌ వానిచెక్‌ (Sébastien Vaniček) దర్శకత్వం వహించారు.

Tags

Related News

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Big Stories

Advertisement
×