E-Paper
Advertisement

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!
Advertisement

Onion Pakoda Recipe: సాయంత్రం కాగానే ఆకాశం కాస్త మబ్బు పట్టి, చిన్నగా చినుకులు పడుతుంటే మన మనసు వెంటనే దేని వైపు లాగుతుందో తెలుసా? వేడి వేడి టీ, దానికి జోడీగా నోరూరించే కరకరలాడే పకోడీలు. వర్షం పడుతున్నప్పుడు బయట టీ షాప్ దగ్గర దొరికే ఆ కరకరలాడే ఉల్లిపాయ పకోడీ వాసనే వేరు. అదే రుచిని, అంతకంటే శుభ్రంగా మన ఇంట్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా సాయంత్రం స్నాక్స్ కోసం పిల్లలు ఏదైనా అడిగినా పది నిమిషాల్లో క్షణాల్లో సిద్ధమైపోయే అద్భుతమైన స్నాక్ ఇది. పైకి కరకరలాడుతూ, లోపల ఉల్లిపాయ తీపితో నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ పకోడీలను సరైన కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు – మూడు ( పొడవుగా, సన్నగా తరిగినవి )
శనగపిండి – ఒక కప్పు
బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – నాలుగు ( సన్నగా తరిగినవి )
అల్లం తురుము – ఒక టీస్పూను
జీలకర్ర – ఒక టీస్పూను
కరివేపాకు – రెండు రెమ్మలు ( సన్నగా తరిగినవి )
కొత్తిమీర – కొద్దిగా
కారం – ఒక టీస్పూను
పసుపు – పావు టీస్పూను
వాము – అర్ధ టీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వేయించడానికి సరిపడా

Advertisement

Also Read: హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

తయారీ విధానం ఇలా:

ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి చేతితో ఉల్లిపాయలను బాగా నలుపుతూ కలపాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ పొరలు విడిపోవడమే కాకుండా ఉల్లిపాయ నుంచి నీరు బయటకు వస్తుంది.

Advertisement

ఇప్పుడు అదే గిన్నెలో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, జీలకర్ర, నలిపిన వాము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో శనగపిండి, బియ్యప్పిండి వేసి ఉల్లిపాయలకు పిండి బాగా పట్టేలా పొడిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలోని తడిదనమే పిండి కలవడానికి సరిపోతుంది. అవసరమైతేనే ఒక్క చుక్క నీళ్లు చల్లుకోవాలి. పకోడీలు కరకరలాడాలంటే పిండిలో ఒక టేబుల్ స్పూన్ కాగిన వేడి నూనె వేసి కలిపితే చాలా బాగుంటాయి. పిండి ముద్దలా కాకుండా ఉల్లిపాయ ముక్కలకు అంటుకుని విడివిడిగా ఉండాలి.

తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మధ్యస్థంగా ఉంచి, సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా విడివిడిగా నూనెలో వేయాలి.

పకోడీలు నూనెలో వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి, గరిటెతో తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పకోడీలు రెండు వైపులా చక్కగా వేగి, కరకరలాడుతున్నప్పుడు నూనె నుంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, కరకరలాడే వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు సిద్ధం. వీటిని టీతో తింటే ఆ మజానే వేరు.

Also Read: ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

Tags

Related News

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

ఆడవారితో పోలిస్తే మగవాళ్ల జీవితకాలం ఎందుకు తక్కువ? సైన్స్ ఏం చెబుతోందంటే..

ఇంట్లో కూరలు లేవా? 10 నిమిషాల్లో అప్పటికప్పుడు పచ్చి పులుసు చేసేయండి!

Big Stories

Advertisement
×