E-Paper
Advertisement

Niharika Konidela : నిహారిక కొణిదెల, చెఫ్ మంత్ర ఇలా ఉంటే వర్కౌట్ అయ్యేదెలా?

Niharika Konidela : నిహారిక కొణిదెల, చెఫ్ మంత్ర ఇలా ఉంటే వర్కౌట్ అయ్యేదెలా?
Advertisement

Niharika Konidela : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలా మంది హీరోలు ఉన్నారు. కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవాలి అనుకుంది నిహారిక కొణిదెల. హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. తాను చేసిన అన్ని సినిమాలలో ఒక మనసు సినిమా గురించి కొద్దిగా ఎక్కువ వినబడింది. నాగశౌర్య తో కలిసి ఆ సినిమాలో నటించింది నిహారిక.

ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలో అల్లు అర్జున్ మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అల్లు అర్జున్ అప్పట్లో మాట్లాడారు. ఈ ఆడియో లాంచ్ కి వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, సాయి తేజ్ అందరూ కూడా హాజరయ్యారు. కానీ ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. హీరోయిన్ గా చేసిన సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అయ్యారు నిహారిక. తాను తీసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా మంచి సక్సెస్ సాధించింది.

ఆకట్టుకొని చెఫ్ మంత్ర

Advertisement

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలతో పాటు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆహా నిర్వహిస్తుంది. దీనిలో వచ్చే అన్ స్టాపబుల్ అనే షో బాగా సూపర్ హిట్ అయింది. బాలకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం కూడా చాలామందికి కొత్తగా అనిపించింది. ఓటిటికి మంచి గుర్తింపు సాధించిన షో ఇది.

దీనిలో ఆల్రెడీ చెఫ్ మంత్రా పేరుతో సుమ ఒక ప్రోగ్రాం రన్ చేశారు. అది కూడా సక్సెస్ఫుల్గానే కొనసాగింది. ఇప్పుడు అదే పేరుతో నిహారిక కొణిదల కూడా ఒక ప్రోగ్రాం కొనసాగిస్తున్నారు. ఈ షో కి గెస్ట్ గా అడవి శేష్ మరియు రాహుల్ రవీంద్రన్ హాజరయ్యారు. రాహుల్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రేపు విడుదల కానుంది.

Advertisement

Also Read: Funky : ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్, వంశీ కి 2025 కలిసి రావడం లేదని అర్థం అయిపోయినట్లే

వర్కౌట్ అవుతుందా? 

ఈ ఇద్దరు గెస్టులు హాజరైన షో ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అయితే ప్రోమో మాత్రం అంత ఆసక్తికరంగా లేదు. వీరిద్దరూ రావడంతోనే కామెడీగా నీ షో రన్ చేద్దాం అని అనుకున్నారు కానీ అవేవీ వర్కౌట్ అయ్యేలా లేవు.

డ్యాష్ టాస్క్

రాహుల్ రవీంద్రన్, అడవి శేష్ అక్కడ క్లాసులో పెట్టి ఉన్న డ్రింక్ తాగాలి. తాగిన డ్రింక్ గ్లాస్ కింద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్తే ఆ నెంబర్ కార్డు మీద ఒక ప్రశ్న రాసి ఉంటుంది. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడం టాస్క్. అయితే దీనిలో డ్యాష్ అనే ఒక లైన్ పెట్టి ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పిన తర్వాత, ఆ డాష్ ను ఫిల్ చేస్తారు. దీని నుంచి ఫన్ క్రియేట్ చేయాలి అనుకున్నారు కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు.

ఇక నిహారిక విషయానికి వస్తే గతంలో ఢీ షోకి యాంకర్ గా పనిచేశారు. జబర్దస్త్ స్కిట్స్ కూడా కొన్ని చేసి తనదైన మార్క్ చూపించారు. ఇక ఈ చెఫ్ మంత్రా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Related News

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

Big Stories

Advertisement
×