Kalyani Priyadarshan: కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan).. మలయాళ స్టార్ కిడ్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది . ముఖ్యంగా హలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన కళ్యాణి.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న ఈమె.. ఇటీవల లోకా చాప్టర్ 1 : చంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాతో భారీ కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా.. సూపర్ హీరో కాన్సెప్ట్ లో నటించిన తొలి హీరోయిన్ గా కూడా కళ్యాణి రికార్డ్ సృష్టించింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈమెకు కల్కి సీక్వెల్ లో హీరోయిన్ పాత్ర లభించింది అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఈ విషయంపై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది కళ్యాణి ప్రియదర్శన్.. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా, దీపికా పదుకొనే (Deepika padukone) హీరోయిన్గా.. కమలహాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని కలెక్షన్లు దక్కించుకుంది.
ఇకపోతే ఈ సినిమా సీక్వెల్లో కూడా దీపికా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెను తీసేస్తూ అధికారికంగా ప్రకటించారు వైజయంతి మూవీస్. ముఖ్యంగా మొదటి భాగం కంటే సీక్వెల్ కోసం 25% అదనంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం.. దీనికి తోడు 8 గంటల పని దినాలపై ఆమె తన వాయిస్ రైజ్ చేయడంతోనే ఆమెను తప్పించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ ఈ స్థానంలో నటించబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై కళ్యాణి ప్రియదర్శన్ స్పందించింది.
also read:Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?
కళ్యాణి మాట్లాడుతూ.”.కొంతమంది అదే పనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారు అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా.. కానీ వాళ్ళు ఎవరిని ఫైనల్ చేశారో… ఎవరిని తీసుకోబోతున్నారు అనేది తెలియదు. కానీ జనాలు మాత్రం నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారు అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి అనుభూతి ఇంతకుముందు ఎప్పుడు కలగలేదు ” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది కళ్యాణి. మొత్తానికైతే ఈ సినిమాలో తనకు అవకాశం ఇవ్వలేదు అని.. ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా స్పందించింది.