Funky : పిట్టగోడ సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊపించిన సక్సెస్ సాధించలేకపోయింది. నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమాతో కేవలం నటులకు మాత్రమే పేరు రావడం కాకుండా, దర్శకుడిగా అనుదీప్ కు కూడా అద్భుతమైన పేరు లభించింది.
ఆ సినిమాను ఓటీటీ లో విడుదల చేద్దాం అని పలు సందర్భాలలో నిర్మాత అశ్వని దత్ చెప్పిన కూడా లేట్ అయినా పర్వాలేదు. ఇది ఖచ్చితంగా థియేటర్లోనే విడుదల చేయాలి అని పట్టుపట్టి కూర్చున్నాడు నాగ్ అశ్విన్. మొత్తానికి ఈ సినిమా విడుదలై ఊహించిన దాని కంటే అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం అనుదీప్ విశ్వక్సేన్ హీరోగా ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు.
అనుదీప్ చేసిన లాస్ట్ ఫిలిం ప్రిన్స్ ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. శివ కార్తికేయన్ నటించిన ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించింది కానీ తమిళ్లో సక్సెస్ రాలేదు. అయితే ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా చేస్తున్న ఫంకీ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాను ఏప్రిల్ మూడవ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది చిత్ర యూనిట్. మొత్తానికి ఈ సినిమా 2026 లో విడుదలబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
Unlimited Laughter. 😆
Unlimited Entertainment. 😎
Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL
— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. అయితే నాగ వంశీ చేస్తున్న సినిమా లేవీ కూడా ఇప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కింగ్డమ్ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా వార్ సినిమా కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది.
భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన సినిమా మాస్ జాతర. ఈ సినిమాతో మరోసారి కమర్షియల్ సక్సెస్ రవితేజ అందుకుంటాడు అని అందరూ భావించారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా ఊహించిన రేంజ్ లో ఆడలేదు. ఇక 2025 కలిసి రావట్లేదు అని నాగవంశీకి కూడా అర్థమైపోయింది. అందుకే 2026 లో ఫంకీ సినిమాతో తన సక్సెస్ స్టార్ట్ చేద్దాం అని ఉద్దేశంలో ఉన్నట్లున్నారు.
Also Read: Sandeep Reddy Vanga : నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ హీరోగా కొత్త దర్శకుడు పరిచయం