Movie Ending :సినిమా చివర్లో హీరో విలన్ లని చిత్తు చిత్తుగా కొట్టెయ్యాలి. హీరోయిన్ కి మూడు ముళ్ళు వేయాలి. హ్యాపీ గా అందరూ కలిసిపోవాలి. మెజారిటీ ఆడియన్స్ కోరుకునేది ఇదే. ఇక అలా అయితేనే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం కూడా.
అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తో పాటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.యస్ .. కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ రెడ్డి కాంబినేషన్‌లో ఒక క్రేజీ లవ్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సాడ్ గా ఎండ్ కాబోతుందని,ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే సాడ్ ఎండింగ్ థియేటర్లలో ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
సాడ్ ఎండింగ్ తో సూపర్ హిట్ అయిన సినిమాలు
ఇక ఎండింగ్ విషయానికే వస్తే .. అడపా దడపా కొన్ని సినిమాలలో హీరోలని క్లైమాక్స్ లో చంపేస్తే ,అవి సూపర్ డూపర్ హిట్ అయిపోవడంతో పాటు అదే హీరో చనిపోతే అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయండోయ్ .
Also read :ఢిల్లీలో వైభవంగా పద్మ అవార్డుల ప్రదానం.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌లకు పద్మభూషణ్ సత్కారం!
సాడ్ ఎండింగ్ తో సూపర్ హిట్ అయిన సినిమాల విషయానికి వస్తే 1953 నాటి ‘దేవదాసు’ తెలుగు ఇండస్ట్రీలో ట్రాజిక్ లవ్ స్టోరీస్‌కి ఒక బెంచ్‌మార్క్ అనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు ప్రేమికుడిగా పడ్డ వేదన, చివర్లో ఆయన పాత్ర మరణించడంతో సినిమా కి ఒక కల్ట్ స్టేటస్ వచ్చేసింది. అలాగే 1981లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ చిత్రంలో క్యాన్సర్ వ్యాధితో హీరో మరణించినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక 1978లో కమల్ హాసన్, సరిత జంటగా కె. బాలచందర్ తీసిన ప్రేమకావ్యం ‘మరో చరిత్ర’ చివర్లో ప్రేమికులిద్దరు చనిపోవడంతో సంచలన విజయం సాధించింది.
ఇక ఈ తరం సినిమాల్లో 2010 నాటి ‘వేదం’ చిత్రంలో అల్లు అర్జున్ (కేబుల్ రాజు) పాత్ర హాస్పిటల్ లో ఉన్న ప్రజలను కాపాడే క్రమంలో ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంది, ఇది ఒక గొప్ప క్లైమాక్స్ గా నిచిపోయింది .ఇక 2019లో వచ్చిన నాని ‘జర్సీ’లో అర్జున్ పాత్ర తన కొడుకు కోసం, క్రికెట్ పై ఉన్న ప్యాషన్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి, గుండె జబ్బుతో మైదానంలోనే చివరి శ్వాస విడిచే సీన్ థియేటర్లలో అందరినీ ఏడిపించింది.
Also read :సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్.. నందినీ రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లోడింగ్!
2018లో వచ్చిన ‘ఆర్ఎక్స్100’లో కార్తికేయ పాత్ర తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అసలు రంగు తెలిసి, ఆ తట్టుకోలేని బాధతో క్లైమాక్స్ లో చనిపోవడం ఊహించని షాకింగ్ ఎండింగ్ అనే చెప్పాలి.. అలాగే 2022లో విడుదలైన ‘సీతా రామం’ చిత్రంలో దుల్కర్ సల్మాన్ దేశం కోసం పాకిస్తాన్ జైలులో ఉరిశిక్ష పడి మరణిస్తాడు. అతను చనిపోయే ముందు సీతకు రాసిన ఉత్తరం, ఆ ముగింపు ఈ సినిమాను ఎప్పటికీ నిలిచిపోయేలా చేశాయి.ఇక 1989 వచ్చిన గీతాంజలి గూర్చి చెప్పక్కర్లేదు.
హీరోని చంపేస్తే తట్టా బుట్టా సర్దుకున్న సినిమాలు
అయితే ఇలాగే హీరోని చంపేస్తే తట్టా బుట్టా సర్దుకున్న సినిమాలు కూడా ఉన్నాయండోయ్..ఉదాహరణకు..ఇక 1993లో నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘నిప్పు రవ్వ’ అప్పట్లో ఫుల్ డిసప్పాయింట్ చేసింది.బాలయ్య లాంటి మాస్ హీరో క్లైమాక్స్ లో చనిపోతాడన్న హింట్ ఇవ్వడం అభిమానులకు అస్సలు నచ్చలేదు.
2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘చక్రం’.ఈ సినిమాలో హీరోకి క్యాన్సర్ ఉంటుంది. అందరినీ నవ్విస్తూ, చివర్లో ప్రభాస్ పాత్ర మరణిస్తుంది. అప్పటికే ‘వర్షం’ వంటి మాస్ హిట్‌తో ఉన్న ప్రభాస్‌ను అలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడంతో సినిమా కమర్షియల్‌గా ఆడలేదు.
Also read :ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రంభ ఇంట తీవ్ర విషాదం.. నా ప్రపంచం శూన్యమైందంటూ ఎమోషనల్ పోస్ట్!
అలాగే 2015లో వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘కంచె’. క్లైమాక్స్ లో హీరో ధూపాటి హరిబాబు దేశం కోసం, యుద్ధంలో మరణిస్తాడు. విమర్శకుల ప్రశంసలు తో పాటు జాతీయ అవార్డు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలింది.
కల్ట్ స్టేటసా లేక డిజాస్టర్ టాక్ మూటగట్టి ఇస్తుందా
ఇక ఇప్పటి జనరేషన్ కూడా అంతా హ్యాపీ ఎండింగ్ ఆశిస్తారు. కానీ, ఈ రవి వర్మ నంబూరి ఈ సినిమాకి ఎవరూ ఊహించని విధంగా అత్యంత ఎమోషనల్ అండ్ హార్ట్ బ్రేకింగ్ క్లైమాక్స్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.చూడాలి మరి ఈ సాడ్ ఎండింగ్ సినిమాకి కల్ట్ స్టేటస్ తెచ్చిపెడుతుందా లేక డిజాస్టర్ టాక్ మూటగట్టి ఇస్తుందా !