E-Paper
Advertisement

సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్.. నందినీ రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లోడింగ్!

సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్.. నందినీ రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లోడింగ్!

Maa Bangaram :ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సామ్ మా ఇంటి బంగారం సినిమా ఎట్టకేలకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. యస్ ..నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్ .

ట్రైలర్  రిలీజ్ చేసిన మేకర్స్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత రుత్ ప్రభు, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే . ఈ ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం నాడు ఘనంగా రిలీజ్ చేశారు మేకర్స్.

గతంలో సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ హిట్ కొట్టిందో తెల్సిందే.మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ‘మా ఇంటి బంగారం’పై భారీ అంచనాలే ఏర్పడ్డాయ్.

జూన్ 19న  వరల్డ్ వైడ్ రిలీజ్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ.. ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపింది.సినిమా కోసం ఏంటో కష్టపడ్డారంటూ నందినీ రెడ్డి, రాజ్ నిడిమోరు లని ఆకాశానికి ఎత్తేసింది సామ్ .షూటింగ్ సమయంలో ఎలాంటి విభేదాలు లేకుండా, ఎంతో పర్‌ఫెక్ట్ గా అవుట్‌పుట్ తీసుకొచ్చారని,ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, కామెడీతో పాటు హృదయానికి హత్తుకునే బలమైన కుటుంబ భావోద్వేగాలు ఉన్నాయని, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అలరిస్తుందని చెప్పుకొచ్చింది.

ఇక రాబోయే జూన్ 19న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని, అభిమానులు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుందని కాన్ఫిడెన్స్ చూపించడం విశేషం.
ఈ మధ్య కాలంలో సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలైన ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి ప్రయోగాత్మక చిత్రాల తర్వాత, పూర్తిస్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రావడం ఇదే కావడం విశేషం.

బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాస్ట్‌ అవ్వడం ఖాయం 

దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పటి సమంతతో పోలిస్తే ఇప్పటి సమంత నటనలో ఎంతో పరిణతి చెందిందని, ఆమె ప్రదర్శన నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని మెచ్చుకుంది. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా ఒక సాధారణ అభిమానిలా మానిటర్ ముందు కూర్చుని సమంత నటనను చూసి ఎంజాయ్ చేశానని, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాస్ట్‌ అవ్వడం ఖాయమని స్పష్టం చేసింది.

మరో నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. ఈ కథకు ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఎంతో యాప్ట్ అని, ఇందులో కేవలం ప్రేమానురాగాలే కాకుండా వాటి వెనుక ఉండే ఒక డార్క్ సైడ్, పొసెసివ్‌నెస్ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని వెల్లడించారు. సమంత, నందినీ రెడ్డిల మధ్య ఉన్న బలమైన బాండింగ్ వల్లే ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చిందని హిమాంక్ దువ్వూరు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి, అలాగే నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి కూడా ఈ ఈవెంట్‌లో తమ సంతోషాన్ని పంచుకున్నారు. సమంత గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభవమని, థియేటర్లలో గన్ పవర్‌తో పాటు గాజుల పవర్ కూడా ఎలా ఉంటుందో జూన్ 19న ప్రేక్షకులు చూడబోతున్నారని హింట్స్ ఇచ్చారు.

కథ, స్క్రీన్‌ప్లే అందించిన రాజ్ నిడిమోరు

టాలీవుడ్‌లో ఈ సమ్మర్ ఎండింగ్ లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ లో ‘మా ఇంటి బంగారం’ ఒకటి. ఈ చిత్రంలో కన్నడ నటుడు దిగంత్, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. సీనియర్ నటీమణులు గౌతమి, లక్ష్మి, ఆనంద్, మంజూష తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

మోస్ట్ పాపులర్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా బాధ్యతలను, లీ విట్టేకర్ యాక్షన్ సీక్వెన్స్ లను కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమాకి రాజ్ నిడిమోరుతో కలిసి వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. చూడాలి మరి పెళ్లి తర్వాత వస్తున్న ఈ బంగారం ఎలా మెరుస్తుందో !

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×