Investigative Thriller OTT : ఒక డెడ్ బాడీని ఇన్వెస్టిగేట్ చేయడం సాధారణ విషయం. కానీ అదే డెడ్ బాడీని నాలుగు వెరైటీ కాలాల్లో చూసి, నలుగురు డిటెక్టివ్ లు ఇన్వెస్టిగేట్ చేస్తే ఎలా ఉంటుంది ? అది అసలు సాధ్యమేనా ? ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
మైండ్-బెండింగ్ బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ మర్డర్ మిస్టరీ సిరీస్ Bodies. 2023లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది ఈ సిరీస్. సియా స్పెన్సర్ రాసిన ప్రసిద్ధ గ్రాఫిక్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ అంతా వేర్వేరు కాలాలలో జరిగే ఒకే మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. చివరకు 2053, 2023లోని డిటెక్టివ్ లు కలిసి గతాన్ని మార్చడానికి ట్రై చేస్తారు. ముందుగా 2023లో స్టోరీ సాగుతుంది. ఇలియాస్ మన్వెక్స్ చిన్నతనంలోనే బాంబు పేల్చకుండా అతని మనసు మార్చడంలో షహారా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఆ టైమ్ లూప్ బ్రేక్ అయ్యి, ఇలియాస్ ఉనికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుంది. ఈ 8 ఎపిసోడ్ల అద్భుతమైన లిమిటెడ్ సిరీస్ Netflixలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ‘Dark’, ‘1899’ వంటి మైండ్-బెండింగ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
లండన్ లోని వైట్ చాపెల్ వీధిలో శవం కంటిపై గాయంతో, బట్టలు లేకుండా కనబడుతుంది. విచిత్రం ఏమిటంటే… ఒకే ప్రదేశంలో, ఒకే మనిషి శవం… కానీ నాలుగు వేర్వేరు సంవత్సరాలలో దొరుకుతుంది: 1890 లో డిటెక్టివ్ హిలింగ్‌హెడ్, 1941 లో డిటెక్టివ్ వైట్‌మన్, 2023 లో డిటెక్టివ్ షహాారా హసన్, 2053 లో డిటెక్టివ్ ఐరిస్ మేపుల్‌వుడ్‌లు ఇదే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండడం ట్విస్ట్. ఒకే శవం కాలాలను దాటి ఎలా ప్రత్యక్షమైంది ? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ మూవీ స్టోరీ నడుస్తుంది.
Also Read : డబ్బున్న కుర్రాడితో స్నేహం… ఆఖరి వరకు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేరు
ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ, చనిపోయిన వ్యక్తి 2053కి చెందిన ‘గ్యాబ్రియల్ డెఫో’ అనే సైంటిస్ట్ అనే విషయం బయట పడుతుంది. అతను కనిపెట్టిన ‘ది థ్రోట్’ (The Throat) అనే టైమ్ ట్రావెల్ పోర్టల్ ద్వారా అతను గతంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దీనివల్ల జరిగిన ప్రమాదంలో అతని శరీరం నాలుగు కాలాల్లోకి విడిపోతుంది. ఇలియాస్ మన్వెక్స్ అనే సైకో లీడర్ ఈ టైమ్ లూప్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. డిటెక్టివ్ షహారా ఈ విషయాన్ని గమనిస్తుంది. ఇలియాస్ మన్వెక్స్ 2053 నుండి 1890లోకి వెళ్తుంది. ఆ తరువాత ఏం జరిగింది ? చివరకు ఆ అణు బాంబు పేలిందా లేదా? మైండ్ బెండింగ్ క్లైమాక్స్ ఏంటి ? అనేది తెరపై చూడాల్సిందే.