Padma Awards: వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన వారిని గుర్తిస్తూ ప్రభుత్వం పద్మ అవార్డ్స్ ని ఇస్తుందన్న సంగతి తెల్సిందే.ఇదే క్రమంలో తాజాగా ‘పద్మ అవార్డులు 2026’ ప్రదానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ఈరోజు (మే 25 సోమవారం) ఘనంగా జరిగింది.దేశ ప్రథమ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను అందజేశారు. ఈ మెగా ఈవెంట్‌లో భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన నటీనటుల హడావుడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ధర్మేంద్ర ‘పద్మవిభూషణ్’ అవార్డు అందుకున్నహేమమాలిని
ముఖ్యంగా బాలీవుడ్ నిన్నటి తరం ‘హీ-మ్యాన్’, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ అవార్డును ఆయన భార్య, నటి హేమమాలిని అందుకోవడం అక్కడున్న వారి కళ్ళని చెమర్చిందనే చెప్పాలి.ఆరు దశాబ్దాల పాటు హిందీ సినిమాని ఏలిన ధర్మేంద్ర 90 ఏళ్ల వయసులో 2025 నవంబర్ 24న కన్నుమూసిన సంగతి తెల్సిందే.
Also read :సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్.. నందినీ రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లోడింగ్!
గతంలో 2012లో ఆయనను పద్మభూషణ్ వరించగా, ఇప్పుడు మరణానంతరం పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం.’షోలే’, ‘ధరమ్ వీర్’, ‘యాదోం కీ బారాత్’ వంటి ఇండస్ట్రీ హిట్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ధర్మేంద్ర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ హేమమాలిని వేదికపై ఎమోషనల్ అయిపొయింది.
66 మందికి పద్మ పురస్కారాలు
రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి అగ్రనేతలు హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 5 మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా, తొలి విడతలో భాగంగా సోమవారం నాడు 66 మందికి రాష్ట్రపతి స్వయంగా ఈ పురస్కారాలను బహూకరించారు.
#PadmaAwards2026
🏅पद्म विभूषण✨ धर्मेन्द्र सिंह देओल (मरणोपरांत)
✨ डाॅ एन. राजम्#PadmaAwards #PeoplesPadma #PeoplesPadma2026 #PadmaVibhushan@PIBMumbai @airnews_mumbai @PibLucknow @DDUttarPradesh @airnews_gkp pic.twitter.com/lkwbogosGr— सूचना एवं प्रसारण मंत्रालय (@MIB_Hindi) May 25, 2026
మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం
కళలు, సామాజిక సేవ, క్రీడలు, వైజ్ఞానిక రంగాల్లో విశేష కృషి చేసిన వారిని సత్కరించిన ఈ వేడుకలో సినీ పరిశ్రమకు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మమ్ముట్టిక’గా పిలవబడే మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మధ్యే ‘భీష్మ పర్వం’, ‘బ్రహ్మయుగం’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్న మమ్ముట్టి, దశాబ్దాలుగా సౌత్ ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా కొనసాగుతున్నారు.
Also read :ఒక్క రోజుకు రెండు లక్షలా? చరణ్ కొత్త బాడీగార్డ్ సాలరీ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
ఆయనతో పాటు మధురమైన గొంతుతో దేశాన్ని ఊపేసిన ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ కూడా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. 90ల కాలంలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి ఎన్నో మ్యూజికల్ హిట్లకు ప్రాణం పోసిన అల్కా, ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే అడ్వర్టైజింగ్ రంగ పితామహుడు పీయూష్ పాండేకు మరణానంతరం ప్రకటించిన పద్మభూషణ్‌ను ఆయన భార్య నీతా పాండే అందుకున్నారు.
రాలేకపోయిన మాధవన్, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్
మరోవైపు సినిమా రంగానికి చెందిన పలువురు వర్ధమాన, సీనియర్ నటులను ‘పద్మశ్రీ’ పురస్కారాలు వరించాయి. బహుభాషా నటుడు, ‘మాధవన్’ (ఆరుగరు వంటి విలక్షణ చిత్రాలు సహా ఇటీవల ‘రోకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’తో జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు), బెంగాలీ సూపర్ స్టార్ ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, బాలీవుడ్ సీనియర్ కామెడీ కింగ్ సతీష్ షాలతో పాటు టాలీవుడ్ సీనియర్ నటులు మురళీ మోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌లకు కూడా ఈ ఏడాది పద్మశ్రీ దక్కింది. అయితే అనివార్య కారణాల వల్ల మాధవన్, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ ఈ సోమవారం నాటి కార్యక్రమానికి రాలేకపోయారు.