E-Paper
Advertisement

ఉత్తేజ్ కూతురు చేతన జీవితంలో ఇన్ని కష్టాలా?

ఉత్తేజ్ కూతురు చేతన జీవితంలో ఇన్ని కష్టాలా?
Advertisement

Chetana Uthej:చేతన..కుక్క కావాలి అంటూ చిత్రం సినిమాలో గుక్క పట్టి ఏడ్చి అలరించిన పాప గుర్తుందా ..?తన పేరే చేతన.ఈ పేరు చెప్పగానే ఎవరూ పెద్దగా గుర్తు పట్టరేమో కాని,ఉత్తేజ్ కూతురు చేతన అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు.

ఉత్తేజ్ డాటర్ గా చిన్నప్పటి నుండే ఇండస్ట్రీని చదివేసిన తన సినీ జర్నీ గురించి,చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకెదురైన అనుభవాలని,పర్సనల్ లైఫ్ లో జరిగిన పలు
ఆసక్తికర విషయాలను ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన తల్లికి క్యాన్సర్ అని తెలిసినప్పుడు తనకి ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

Advertisement

చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి ఎంట్రీ..

చేతన మాట్లాడుతూ తనకి చిన్నప్పటి నుండే యాక్టింగ్ , డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉందని, అలా నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చింది.మొదటగా ‘గిల్లికజ్జాలు’ సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించానని ఆ తర్వాత ‘బద్రి’, ‘చిత్రం’, ‘భద్రాచలం’, ‘పౌర్ణమి’ వంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని ఆనాటి రోజులని గుర్తుచేసుకుంది.

Advertisement

వీటిలో ముఖ్యంగా ‘చిత్రం’ సినిమాలోని ‘కుక్క కావాలి’ పాట తనకి ఎంతో పేరు తెచ్చిందని, ఇక అ పాటని స్వయంగా తానే పాడానని,ఆ విధంగా ఆ పాట తనకి ఎంతో స్పెషల్ అని తెలిపింది.ఇక ఆ సినిమాలో అంత మంచి అవకాశం ఇచ్చినందుకుదర్శకుడు తేజకు తన జీవితాంతం రుణపడి ఉంటానని తన కృతజ్ఞతని చాటుకుంది.

హీరోయిన్‌గా అవకాశాలు ఎందుకు రాలేదంటే?

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గాతెచ్చుకున్న చేతన.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నానని,అయితే తాను సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేస్తున్న సమయంలో ఎక్కువగా తెలుగు అమ్మాయిలని మెయిన్ లీడ్ రోల్స్ కి కాకుండా సైడ్ రోల్స్ కి ప్రిఫర్ చేసేవారని ,ఎక్కువగా హీరోయిన్ రోల్స్ కి వేరే భాషల నుండి సెలెక్ట్ చేసేవారని వాపోయింది.

అయితే తనకి హీరోయిన్ ఛాన్సులు దక్కకపోవడానికి ఇదొక్కటే కారణం కాదని,వీటితో పాటు ఇంకా అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది.అందుకే తాను హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం కంటే ముందుగా నటిగా తన టాలెంట్ నిరూపించుకోవాలనుకున్నానని చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌తో షూటింగ్ అనుభవాలు..

ఇక ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ సినిమాలో నటించే సమయంలో తనకు సుమారు 13 ఏళ్ల వయసు ఉంటుందని షూటింగ్ సమయంలో ప్రభాస్ తనను ఆటపట్టిస్తూ ఉండేవారని, ఆయన అల్లరి వల్ల కొన్నిసార్లు చిరాకు వచ్చేదని నవ్వుతూ ఆనాటి రోజులని గుర్తుచేసుకుంది.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ, అప్పట్లో ఎలా పలకరించారో ఇప్పటికీ అలాగే ఆప్యాయంగా మాట్లాడుతారని ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసింది చేతన.ఇక ఆయన వ్యక్తిత్వంలో తనకు నచ్చిన గొప్ప లక్షణం ఇదేనని చెప్పడమే కాకుండా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ లో తాను పనిచేస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చింది.

తల్లి అనారోగ్యం గురించి తెలిసి కుప్పకూలిపోయా..

ఇక ఇదే ఈ ఇంటర్వ్యూలో చేతన తన తల్లి అనారోగ్యానికి సంబంధించిన విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. తాను షూటింగ్‌లో ఉన్న సమయంలో డాక్టర్ ఫోన్ చేసి తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని ,ఇక ఆ సమయంలో ఏం చేయాలో, ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో తెలీక డిప్రెషన్ కి లోను అయ్యానని చెప్పింది.

ఇక ఆ సమయంలో తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి ఏడ్చానని, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని వివరించింది. తన జీవితంలో ఎదురైన వెరీ బ్యాడ్ ఫేజ్ మూమెంట్ లో ఇది కూడా ఒకటని తెలిపింది .ఇక తాను ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు తన తల్లి చనిపోయిందని బాధ పడిపోయింది.

మొత్తానికి..బాలనటిగా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి, ఎన్నోసినిమాల్లో నటించిన చేతన ఇపుడు తన తల్లిని కోల్పోయానంటూ ఎమోషనల్ అవుతూ గుర్తుచేసుకున్న మాటలు ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

ALSO READ :ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!

Tags

Related News

నాన్నతో కోల్డ్ వార్.. పెళ్లికి ముందే విభేదాలు.. ఉత్తేజ్ కూతురు చేతన షాకింగ్ కామెంట్స్!

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రామాయణ.. భారీ రన్ టైం లాక్!

జైలర్ 2 కోసం రజినీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కోలీవుడ్ లోనే హైయెస్ట్!

జీరోతో మొదలై వందల కోట్ల ఆస్తి వరకు.. విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా!

పెళ్లయినా.. విజయ్ రష్మిక కోరిక తీర్చలేదా?

జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

రావు రమేష్ కి సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×