Upcoming SUVs in India 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2026 ఎండింగ్ లో కొత్త SUVల సందడి నెలకొననుంది. హ్యుందాయ్, హోండా, మహీంద్రా, JSW లాంటి కంపెనీల నుంచి కొత్త మోడళ్లు రాబోతున్నాయి. పెట్రోల్ ఇంజిన్ తో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కూడిన SUVలు ఈ లిస్టులో ఉన్నాయి. డిసెంబర్ 2026 నాటికి మార్కెట్లోకి రానున్న నాలుగు SUVల గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ బేయాన్ కొత్త కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ SUVగా మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 115 PS పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, IVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉండనున్నాయి. డిజైన్ పరంగా ఇందులో LED లైట్ బార్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకట్టుకోనున్నాయి. క్యాబిన్‌లో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, వాయిస్ అసిస్టెంట్, ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవెల్ 2 ADAS లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
JSW కాంబాట్ SUV డిసెంబర్ 4, 2026న విడుదల కావచ్చని అంచనా. దీని ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4 kWh బ్యాటరీతో కూడిన ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వ్యవస్థ ఉండనుంది. ఈ పవర్‌ట్రెయిన్ 360 hp పవర్, 610 Nm టార్క్ ను అందించవచ్చని అంచనా. ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణించడంతో పాటు, సుదూర ప్రయాణాలకు పెట్రోల్ ఇంజిన్ ఉపయోగపడనుంది.
హోండా 0 ఆల్ఫా భారత మార్కెట్లోకి రానున్న కీలక ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. డిసెంబర్ 2, 2026న విడుదల కావచ్చని అంచనా. దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఈ SUVలో 65 kWh నుంచి 75 kWh వరకు బ్యాటరీ ఆప్షన్స్ ఉండవచ్చని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదని తెలుస్తోంది. అయితే, వాస్తవ రేంజ్ బ్యాటరీ వెర్షన్, డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
మహీంద్రా విజన్ S SUV డిసెంబర్ 2026లో మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. దీని అంచనా ధర రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండవచ్చు. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉండవచ్చని సమాచారం. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. NU_IQ ప్లాట్‌ఫామ్‌పై రూపొందనున్న ఈ SUV క్యాబిన్‌లో డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆఫ్‌రోడ్ మోడ్‌ల కోసం ప్రత్యేక బటన్లు ఉండవచ్చని తెలుస్తోంది.
Read Also: మహీంద్రా XUV 3XO CNG బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే..