Chetana Uthej:టాలీవుడ్ యాక్టర్ ఉత్తేజ్ కూతురు చేతన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, తండ్రితో ఉన్న విభేదాలు, సినీ కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి పలు ఆసక్తికర విషయాలని ఇలా చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా పెళ్లికి ముందే తనకు, తండ్రి ఉత్తేజ్‌కు మధ్య మనస్పర్థలు ఉండేవని, ఆ తర్వాత కొన్ని కారణాలతో కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిందని అసలు విషయం చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాల గురించి తామెప్పుడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదని స్పష్టం చేసింది.
నాన్నతో విభేదాలు.. పెళ్లికి ముందే
ఉత్తేజ్ తనకు తండ్రి మాత్రమే కాదని, ఒకప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తు చేసుకుంది. చిన్నతనంలో స్కూల్‌కు వెళ్లినా, తనకు తండ్రితో ఎంతో అనుబంధం ఉండేదని అయితే క్రమక్రమంగా సినిమా కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో తమ మధ్య విబేధాలు వచ్చాయని తెలిపింది.
ఇక పెళ్లి తర్వాత తమ కుటుంబంలో దూరం మరింత పెరిగిందని, కానీ పెళ్లి ఒక్కటే అందుకు కారణం కాదని , పెళ్లికి ముందే తమ మధ్య కోల్డ్ వార్ ఉండేదని తెలిపింది. తన తల్లితో ఎలాంటి గొడవలు లేవని, తండ్రితోనే కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయని చెప్పింది.
ఇక కుటుంబంలో ఏం జరిగినా బయటకు వచ్చి మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే తాము మౌనంగా ఉన్నామని ,తమ వైపు నుంచి సమస్యలను సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు అనుకున్నట్లుగా మారలేదని బాధ పడిపోయింది.ఇక పేరెంట్స్ కి కూడా కొంత సమయం ఇవ్వాలని భావించి వెనక్కి తగ్గామని తెలిపింది.
హీరోయిన్‌గా నిరూపించుకోవాలనుకున్నా..
ఇక సినిమాల్లోకి రావాలన్నది తనకు మొదటి నుంచి తనకున్న ఇంట్రెస్ట్ అని, తనను హీరోయిన్‌గా పరిచయం చేయాలని తండ్రి ఉత్తేజ్ అనుకునే వారని, అయితే తాను మాత్రం హీరోయిన్ పాత్రలతో పాటు నటిగా కూడా తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నానని మనసులోని మాటని బయట పెట్టింది.
ఈ క్రమంలోనే కొన్ని మంచి అవకాశాలు చేజారిపోయాయని, ముఖ్యంగా వెంకటేశ్ నటించిన ‘దృశ్యం’ సినిమాలో పెద్ద కూతురు పాత్ర చేసే అవకాశం వచ్చినప్పటికీ, హీరోయిన్‌గా ప్రయత్నిస్తున్న కారణంగా ఆ పాత్రను చేయలేకపోయానని వాపోయింది. ఆ పాత్ర చాలా బాగుంటుందని, సినిమాలో ఆ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందని ,అది ,మిస్ అయినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని తెలిపింది.
ఇక తాను ఏ సినిమా చేయాలన్నా తండ్రి సలహాలు తీసుకునేదాన్నని, ఆయన కూడా కథలు వినమని, ముందుకు వెళ్లమని చెప్పేవారని అయితే కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవకాశాలు చేజారిపోయాయని బాధ పడింది.
మొదలై ఆగిపోయిన తొలి సినిమా..
ఇక తాను హీరోయిన్‌గా ఒక సినిమా మొదలైందని,దానికి పూరి జగన్నాథ్ కలప కూడా కొట్టారని,అందులో మహత్ రాఘవేంద్ర హీరోగా నటించాల్సి ఉందని తెలిపింది.అయితే సినిమా కొంత అయ్యాక దర్శకుడు, నిర్మాత మధ్య గొడవలు జరగడంతో ఆ సినిమా ఆగిపోయిందని ఆ రోజులని గుర్తుచేసుకుంది.
ఇక ఆ తర్వాతే ‘పిచ్చిగా నచ్చావు’ సినిమాలో హీరోయిన్‌గా నటించానని ,అయితే ఆ సినిమాకు సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల కెరీర్ అనుకున్నట్టుగా సాగలేదని వాపోయింది .అలాగే ఉత్తేజ్ కూతురు కావడంతో క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే క్రమంలో కూడా వెనుకడుగు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయని వివరించింది.
కుటుంబ విషయాలు బయటకు ఎందుకు చెప్పలేదు?
ఇక తన కుటుంబంలో జరిగిన విషయాలను పర్సనల్ గానే ఉంచాలని అనుకున్నామని తండ్రి ఉత్తేజ్ కూడా ఈ విషయాల గురించి బయట ఎక్కడా మాట్లాడలేదని గుర్తు చేసుకుంది.తల్లిదండ్రుల మధ్య గొడవలు అయితే ఒకరితో ఒకరు మళ్లీ నార్మల్ గానే ఉంటారని కానీ పిల్లలు మాత్రం జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక అయోమయానికి గురవుతారని ,నా జీవితంలో కూడా అలాగే జరిగిందని చెప్పుకొచ్చింది చేతన.
ALSO READ :ఉత్తేజ్ కూతురు చేతన జీవితంలో ఇన్ని కష్టాలా?