E-Paper
Advertisement

అప్పట్లో సామాన్యులను లక్షాధిపతులను చేసిన ధీరుభాయ్.. ‘జియో’ IPOతో అది సాధ్యమేనా?

అప్పట్లో సామాన్యులను లక్షాధిపతులను చేసిన ధీరుభాయ్.. ‘జియో’ IPOతో అది సాధ్యమేనా?
Advertisement

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అంబానీ కుటుంబం అంటేనే ఒక బిగ్ నేమ్. 1977లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ పేరుతో కేవలం 2.8 కోట్ల రూపాయలతో ఐపీవో తెచ్చినప్పుడు.. అప్పట్లో షేర్ మార్కెట్ అంటే కేవలం బ్రోకర్లు, పెద్ద పెద్ద సంపన్నులకే పరిమితం అనుకునేవారు. కానీ ధీరూభాయ్ ఆలోచనే వేరు. సామాన్యులను కూడా ఇన్వెస్టర్లుగా మార్చాలని ఆయన అడుగులు వేశారు.

రూ.వెయ్యికి.. రూ.50 వేలు

అప్పట్లో కేవలం వెయ్యి రూపాయలు పెట్టి రిలయన్స్ షేర్లు కొన్నవాళ్లు.. కేవలం ఎనిమిదేళ్లలో డివిడెండ్లు పోను ఏకంగా యాభై వేల రూపాయలకు పైగా లాభాలు అందుకున్నారు. కొంచెం ఎక్కువ అంటే రెండు వేలు పెట్టినవాళ్లు లక్షాధికారులు అయ్యారు. ఆ రోజుల్లో సామాన్యులకు ‘లక్షాధికారి’ కావడం అనేది ఒక పెద్ద కల. ఆ కలను రిలయన్స్ నిజం చేసింది. అయితే ఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. మార్కెట్‌లో ఎన్నో ఒడిదుడుకులు, ప్రత్యర్థులతో పెద్ద యుద్ధాలే జరిగాయి. 1986లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్టర్లు తీవ్ర నష్టాలను కూడా చవిచూశారు. అయినా సరే, రిలయన్స్ సృష్టించిన ఈ ఈక్విటీ కల్చర్ దేశంలోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది.

జియో ఎంట్రీతో డిజిటల్ విప్లవం

Advertisement

ఇక కాలం మారుతూ వచ్చింది. 2002లో ధీరూభాయ్ కన్నుమూశాక, ఆ తర్వాత కుటుంబ విభజన జరిగి రిలయన్స్ వ్యాపారాలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ చేతులకు వెళ్లాయి. ముకేశ్ అంబానీ చేతిలో ఉన్న రిలయన్స్.. పెట్రోకెమికల్స్ నుంచి రిటైల్, టెలికాం రంగాల వరకు విస్తరించింది. ముఖ్యంగా 2016లో జియో ఎంట్రీతో దేశంలో డిజిటల్ విప్లవమే వచ్చింది.

నేడు భారీ IPOతో ముందు..

ఇప్పుడు సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత.. ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ సారథ్యంలోని జియో ప్లాట్‌ఫామ్స్ భారీ ఐపీవోతో ముందుకు వచ్చింది. జియో ప్లాట్‌ఫామ్స్ ఇష్యు ధర వెయ్యి 65 రూపాయల నుంచి 1,119 రూపాయల మధ్య ఉంది. మార్కెట్లో ఇది ఓపెన్ అయిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి రికార్డు సృష్టించింది. గ్రే మార్కెట్‌లోనూ దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అప్పట్లో రిలయన్స్ షేర్ల కోసం లైన్లలో నిలబడిన జనం.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా చిటికెలో జియో షేర్లు కొనుగోలు చేసే స్థాయికి టెక్నాలజీ మారిపోయింది. మొత్తానికి.. ధీరూభాయ్ అంబానీ వేసిన తొలి అడుగు నేడు జియో రూపంలో మరో బిగ్గెస్ట్ మైలురాయిని తాకింది.

ఉదయం 10.36 గంటలకే.. పూర్తిగా సబ్‌స్క్రయిబ్

Advertisement

జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వచ్చింది. పబ్లిక్ ఇష్యూ మొదలైన తొలిరోజే ఉదయం 10 గంటలా 36 నిమిషాలకే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయింది. మెగా ఐపీల్లో ఇంత వేగంగా వంద శాతం సబ్‌స్క్రయిబ్ అయిన ఇష్యూగా రికార్డు సృష్టించింది. ఆఫర్ చేసిన 19 కోట్లా 75 లక్షల షేర్లకు గాను ఉదయం పదిన్నరకే 20 కోట్లా 3 లక్షల షేర్లకు బిడ్లు దాఖలయ్యయాయి. ఇది కేవలం రిటైలర్ల కోటాకు సంబంధించిన అంశమే. అటు క్యూఐబీ కోటాలో అదే సమయానికి 300 శాతం పైగా సబ్‌స్క్రయిబ్ అయింది. గతంలో మెగా ఐపీఓల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కటే మొదటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయింది. ఓవరాల్‌గా తొలిరోజు జియో ఐపీఓ రిటైలర్ కోటా… రెండున్నర రెట్లకు పైగా సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు మదుపర్లు.

Also Read: దేశంలో అతిపెద్ద జియో ఐపీఓ ప్రారంభం.. IPO పూర్తి వివరాలివే.. 

గ్రే మార్కెట్లోనూ రెస్పాన్స్ అదుర్స్!

ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ సారథ్యంలోని జియో ప్లాట్‌ఫామ్స్ తీసుకొచ్చిన భారీ ఐపీఓ టోటల్ వాల్యా 30 వేల కోట్లు. ఒక్కో షేరుకు ఇష్యూ ధర 1065 రూపాయల నుంచి 1119 రూపాయల మధ్య ఉంది. గ్రే మార్కెట్‌లోనూ జియో ఐపీఓకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం గ్రేమార్కెట్‌లో జియో షేర్ వాల్యూ 1370 రూపాయలు పైనే ఉంది. లిస్టింగ్ నాటికి గ్రే మార్కెట్ ప్రీమియం మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. జియో పరిణామ క్రమంలో ఈ ఐపీఓ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు ఆకాశ్ అంబానీ. డిజిటల్ సేవల్ని మరింత విస్తరిస్తామనీ… హోం బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్‌ పరిధి పెంచుతామని తెలిపారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో మెటా గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడిదారులుగా ఉన్నాయి.

Tags

Related News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఏం జరిగింది? ఇద్దరు సీనియర్‌ అధికారులపై విచారణ పూర్తి! రేపో మాపో చర్యలు

40 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా పెట్టుబడి చేస్తే రూ.3 కోట్ల రాబడి

దీపావళి ముందు తగ్గిన బంగారం ధరలు.. మరింత తగ్గుతాయా?

దేశంలో అతిపెద్ద జియో ఐపీఓ.. బుధవారం నుంచి ప్రారంభం, 22 శాతానికి చేరిన జీఎంపీ

చమురు ధరలకు రెక్కలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 110 డాలర్లు, వచ్చేనెల ధరలు పెరిగే ఛాన్స్

ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

భర్త సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. అయినా భార్యకు భరణం ఇవ్వకూడదని చెప్పిన కోర్టు.. ఎందుకంటే

Big Stories

Advertisement
×