Kushai Guda Theft: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలోని కృష్ణవేణి హైట్స్ అపార్ట్‌మెంట్.. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ఆ హౌస్‌లో ఇప్పుడు బోరున విలపిస్తున్న శబ్దాలే వినిపిస్తున్నాయి. దసరా పండగ సెలవులు కదా.. హ్యాపీగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లొద్దామని ఆ ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది. ఇంటికి తాళం వేసి.. బండి ఎక్కి అమ్మవారి దర్శనానికి బయల్దేరారు. వాళ్ళు ఊరు దాటారో లేదో.. ఆ ముఠా కన్ను ఆ ఇళ్ల మీద పడింది. అరే.. పండగ పూట మంచి బోణీ దొరికిందిరా అనుకున్నారో ఏమో.. క్షణాల్లో రంగంలోకి దిగిపోయారు.
బీరువాలో బంగారం, వెండి చోరీ..
మెయిన్ డోర్ లాక్‌ను వాళ్లకు తెలిసిన ట్రిక్‌తో ఓపెన్ చేశారు. లోపలికి దూరిన ఆ దుండగులు.. అల్మరాలు, కప్‌బోర్డ్స్‌ని తిరగేశారు. బట్టలు, సామాన్లు అన్నీంటిని గాలిలో ఎగిరేశారు. ఎక్కడ ఏం దాచినా వదిలిపెట్టలేదు. బీరువాలో భద్రంగా దాచుకున్న 30 తులాల బంగారం, అలాగే మరో 30 తులాల వెండి వస్తువులను సంచిలో సర్దేసుకొని సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఆ ఫ్యామిలీ జీవితకాలపు కష్టాన్ని.. ఆ దొంగలు ఒక్క రాత్రిలో ఊడ్చేసి మాయమయ్యారు.
ఓనర్స్ కి దిమ్మతిరిగే షాక్..
దర్శనం ముగించుకుని.. ఎంతో సంతోషంగా ఇంటికి రిటర్న్ అయిన ఆ ఓనర్స్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. లాక్ ఓపెన్ చేసి ఉంది.. ఇంట్లోకి వెళ్తే.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం చూసి.. గుండె ఆగినంత పనైంది. బీరువాలో ఉన్న బంగారం, వెండి కనిపించలేదు. వెంటనే తేరుకుని.. కుషాయిగూడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. అపార్ట్‌మెంట్ చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా? చోరీ జరిగిన సమయంలో ఏమైనా క్లూ దొరుకుతుందా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అసలు ప్రశ్న ఒక్కటే.. ఇల్లు ఖాళీగా ఉందని ఈ గ్యాంగ్‌కి ఎలా తెలిసింది? ముందే రెక్కీ కొట్టారా? ఫుటేజ్‌లో ఏ ముఖం దొరుకుతుందో.. ఏ క్లూ బయటపడుతుందో చూడాలి.
Also Read: నీటిని వృథా చేయవద్దు.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి: సీతక్క