MSVG Movie Story : వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దాదాపు 6 సినిమాల వరకు ఉన్నాయి. అందులో అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపైనే ఉన్నాయి. దీనికి కారణం ఒకటి.. అది మెగాస్టార్ మూవీ అయితే… రెండో కారణం, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్. అలాగే అది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేది కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ సినిమా స్టోరీపై గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. దీని ప్రకారం.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా స్టోరీ ఇదే అని తెలుస్తుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం…
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎన్ఐఏ ఏజెంట్‌గా చేస్తున్నాడు అని ఇప్పటికే అందరికీ తెలుసు. గ్లింప్స్‌లో చిరు అలానే కనిపించాడు. ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు.
కథ ప్రకారం.. చిరంజీవి పాత్రకు హీరోయిన్ నయనతార పాత్రకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అవుతుందంట. పిల్లలు కూడా ఉంటారంట. కానీ, వాళ్లు విడి విడిగానే ఉంటారంట. ఇక్కడ నయనతార పాత్ర మల్టీమిలినియర్ కూతురు. చిరంజీవికి దూరంగా ఉంటున్న నయనతార.. మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుదంట.
ఈ టైంలో నయనతార లైఫ్‌కు థ్రెట్ ఉంటుందని తెలుస్తుందంట. ఆమె సెక్యూరిటీగా… దేశంలోనే శక్తివంతమైన అధికారిని పెట్టాలనే.. ఉద్దేశంతో చిరంజీవిని పంపిస్తారంట. తన మాజీ భార్యకు సెక్యూరిటీగా ఉంటూ.. తన పిల్లలతో, నయనతారతో కామెడీని పండిస్తూ.. అలాగే నయన్‌కు వచ్చే థ్రెట్స్ నుంచి కాపాడుతూ చిరు ఉంటాడంట.
అయితే, నయనతారను రెండో పెళ్లి చేసుకోవడానికి క్లైమాక్స్‌లో విక్టరీ వెంకటేష్ పాత్ర వస్తుందంట. ఓ టైంలో తన పెళ్లి గురించి, గొడవల గురించి వెంకటేష్‌కు చిరు చెబుతూ… తమకు సాయం చేయమని కోరుతాడంట. ఇదే టైంలో అంటే క్లైమాక్స్‌లో నయనతారపై ఎటాక్ జరుగుతుదని సమాచారం. ఆ టైంలో.. చిరంజీవి – వెంకటేష్ పాత్రలు కలిసి నయనతార ప్రాణాన్ని కాపాడుతారంట. తర్వాత చిరంజీవి – నయనతారలు మళ్లి కలిసిపోతారంట. తర్వాత కథ సుఖాంతం అని తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వస్తున్న టాక్.. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ మూవీ స్టోరీ ఇదే అని తెలుస్తుంది.
కథలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి స్టైల్ బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయని, అలాగే మూవీలో పాటలు, చిరు డ్యాన్స్ ఉండేలా కూడా అనిల్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అనిల్ ప్రతి సారి తన కథకు అనుగూణంగానే స్క్రీన్ ప్లే, పాటలు రాసుకుంటాడు. కానీ, ఈ సారి చిరంజీవికి అనుకూలంగా స్క్రీన్ ప్లే, పాటలు రాసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మార్పు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని చూపిస్తుందో చూడాలి మరి. కాగా, ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..