E-Paper
Advertisement

Chiranjeevi: స్పిరిట్ ఓపెనింగ్ కి వెళ్లి.. చరణ్-సందీప్ ప్రాజెక్ట్ సెట్ చేశారా? మహేష్ డెవిల్ లేనట్టేనా..

Chiranjeevi: స్పిరిట్ ఓపెనింగ్ కి వెళ్లి.. చరణ్-సందీప్ ప్రాజెక్ట్ సెట్ చేశారా? మహేష్ డెవిల్ లేనట్టేనా..
Advertisement

Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్టులు ఎవరికి రాసిపెట్టినా కూడా ఇంకొకరు చేయటం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కొన్ని సినిమాలు ప్రత్యేకంగా హీరోలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది రాస్తుంటారు. కానీ ఆ టైం కి అది జరగదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన పోకిరి, బిజినెస్మెన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో జనగణమన అనే సినిమా రాబోతున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు.

మెగాస్టార్ ప్రాజెక్ట్ సెట్ చేశారా?

Advertisement

పూరి జగన్నాథ్ కు వరుస డిజాస్టర్లు రావడంతో ఆ ప్రాజెక్టు కాస్తా పక్కకు పెట్టేశారు. విజయ్ దేవరకొండ హీరోగా కూడా జనగణమన స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేసి ఆపేశారు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు కోసం డెవిల్ అనే ఒక కాన్సెప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. అది అనిమల్ సినిమా కంటే కూడా వైలెంట్ గా ఉంటుందని గతంలో సందీప్ రెడ్డి వంగ చెప్పారు.సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్లు కూడా చిరంజీవికి అతని ఎంత పెద్ద ఫ్యాన్ అని చెబుతారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాడు సందీప్ రెడ్డి.

వారణాసితో మహేష్ బిజీ

Advertisement

ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మహేష్ బాబు కోసం రెడీ చేసిన డెవిల్ సినిమాను రామ్ చరణ్ కోసం అడుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం వినిపిస్తుంది. అలానే గత కొన్ని రోజులుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీని గురించి అధికారక ప్రకటన రాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా అంటే ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చెప్పిన టైంకి రాజమౌళి సినిమా ఎప్పుడూ కూడా విడుదల కాదు.

Also Read: Varanasi OTT: వారణాసి ఓటీటీ డీల్ రూ. 650 కోట్లు.. రిజెక్ట్ చేసిన మేకర్స్, కారణమేంటంటే!

మహేష్ డెవిల్ ఇక చరణ్ దేనా?

సినిమా అద్భుతంగా వచ్చినంత వరకు జక్కన్న దానిని చెక్కుతూనే ఉంటారు. అయితే సినిమా వచ్చినప్పుడు మాత్రం లేట్ అయిన కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వారణాసి సినిమాకి సంబంధించి వరల్డ్ చూపించడానికి మూడు నిమిషాలు వీడియోకే సంవత్సరం పాటు టైం తీసుకున్నారు. ఇప్పుడు మూడు గంటలు సినిమా చూపించాలి అంటే ఎంత టైం తీసుకుంటారో అనేది ఊహకు కూడా అందడం లేదు. ఈలోపు సందీప్ రెడ్డివంగా బయట రెండు సినిమాలు చేసేయొచ్చు. అందుకోసమే మహేష్ బాబు ఈ సినిమా నుంచి బయటకు వచ్చేలోపే అక్కడ స్పిరిట్ పూర్తి చేసి డెవిల్ సినిమా కూడా చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకోసమే డెవిల్ కథను రామ్ చరణ్ కు రెడీ చేయమన్నట్లు మెగాస్టార్ చెప్పినట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారక ప్రతి ప్రకటన మాత్రం రాలేదు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×