E-Paper
Advertisement

అడ్రస్ లేని ‘విశ్వంభర’..అసలు వస్తుందా రాదా ?

అడ్రస్ లేని ‘విశ్వంభర’..అసలు వస్తుందా రాదా ?
Advertisement

Vishwambhara Delay: ఏడు పదులు దాటి నాలుగేళ్లవుతున్నా ఎక్కడా జోష్ తగ్గకుండా వరుస సినిమాల్ని లైన్లో పెడుతున్న చిరు విశ్వంభర విషయంలో మాత్రం హ్యాండ్స్ అప్ చేసినట్టే కనిపిస్తున్నాడు. యస్ ..అచ్చంగా ఆరు నెలల్లోనే మన శంకర వరప్రసాద్ అంటూ సాలిడ్ హిట్ ని డెలివర్ చేసిన చిరు రెండేళ్ళ కిందటే మొదలైన విశ్వంభరని మాత్రం ఇంకా ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతూనే ఉన్నాడు.

ఎలాంటి అప్ డేట్స్ వదలని వశిష్ట

Advertisement

గత సంక్రాంతికి వదిలిన గ్లిమ్ప్స్ లో vfx నాసిరకంగా ఉందన్న నెగిటివ్ కామెంట్స్ మూట గట్టుకున్న వశిష్ట ఆ తర్వాత రామ రామ అంటూ ఏడాదికి ఓ పాటని వదలడం తప్ప ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ వదల్లేదు.అయితే ఇదే UV క్రియేషన్స్ లో నిర్మించిన ‘బైకర్’ సినిమా సైలెంట్‌గా వచ్చి థియేటర్లలోకి వెళ్ళిపోయింది కూడా.కానీ కోట్లు కుమ్మరించిన ‘విశ్వంభర’ విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటికీ నోరు మెదపకపోడం గమనార్హం.దీంతో ‘ఎంత గ్రాఫిక్స్ సినిమా అయినా మరీ ఇన్ని రోజులా,అసలు సినిమా తీస్తున్నావా లేక ఇంకేమైనా చేస్తున్నావా’ అంటూ వశిష్టని చెడుగుడు ఆడేస్తున్నారు మూవీ లవర్స్.మరో వైపు స్వయంగా చిరునే సినిమా జూన్ కాని జులైలో కాని వచ్చే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చినా మేకర్స్ నుండి ప్రమోషన్స్ లో ఎలాంటి పరుగులు కనిపించకపోవడంతో ఈ డౌట్స్ కి మరింత బూస్టప్ వచ్చిన పరిస్థితి.

మెగా ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్న వార్తలు 

Advertisement

ఇదిలా ఉంటె ఇంకో వైపు  kvn బ్యానర్లో చిరు బాబీ కాంబోలో రావాల్సిన సినిమా కూడా డైలమాలో పడిందని సర్క్యులేట్ అవుతున్న వార్తలు మెగా ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయ్.నిజానికి వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ తర్వాత ,చిరు,బాబీ జోడీ కట్టడం,మన శంకరవరప్రసాద్ తర్వాత చిరు చేస్తున్న సినిమా కావడంతో హోప్స్ స్కై లెవల్ లో పెట్టేస్తుకున్నారు ఫ్యాన్స్.కాని ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల ‘టాక్సిక్’ షూటింగ్ కి బ్రేక్ పడిందని,దానివల్ల చిరు ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందన్న వార్తలు మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయ్. దీంతో అసలు “ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ మెగాస్టార్ సినిమా ఆగిపోవడమేంటి?” అంటూ తెగ ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు.
ఇక దళపతి విజయ్ చివరి సినిమా’జన నాయగన్’ విషయంలోనూ ఇదే పరిస్థితి.తెలుగులో డెబ్యూ ఇవ్వకముందే మేకర్స్ నెగెటివ్ వైబ్స్‌ని మూటగట్టుకున్న పరిస్థితి.ఏది ఏమైనా మన శంకర వర ప్రసాద్ తో వచ్చిన సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలని ఆశ పడ్డ మెగా ఫ్యాన్స్ కి ఇపుడు నిరాశే మిగులుతోంది.

ఈ గాసిప్స్ పై సరైన అప్ డేట్స్ ఇస్తారా ..

ఒక పక్క యువీ క్రియేషన్స్ వారు గ్రాఫిక్స్ సాకుతో, మరోపక్క kvn బ్యానర్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ అడ్డం పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్. మరిఇప్పటికైనా సర్క్యులేట్ అవుతున్న వార్తలపై యువీ, కేవీఎన్ బ్యానర్లు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఫ్యాన్స్ ఇదే నిజమని నమ్మేసినా ఆశ్చర్యం లేదు, చూడాలి మరి త్వరలో అయినా ఈ గాసిప్స్ పై సరైన అప్ డేట్స్ ఇస్తారో లేదో !

also read:విడాకులు నిజమేనా శర్వా…? ఇన్‌స్టా నుంచి ఫ్యామిలీ ఫోటోలు అవుట్..!

Related News

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

Big Stories

Advertisement
×