E-Paper
Advertisement

విడాకులు నిజమేనా శర్వా…? ఇన్‌స్టా నుంచి ఫ్యామిలీ ఫోటోలు అవుట్..!

విడాకులు నిజమేనా శర్వా…? ఇన్‌స్టా నుంచి ఫ్యామిలీ ఫోటోలు అవుట్..!
Advertisement

Sharwanand Divorce: గుమ్మాలకి మావిడాకులు కట్టినంత ఈజీగా విడాకులు ఇచ్చేయడం ఇండస్ట్రీలో కామన్. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. అయితే తాజాగా టాలీవుడ్ శర్వా కూడా తన భార్య రక్షితా రెడ్డికి విడాకులు ఇచ్చేశాడన్న వార్త ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.తను హీరోగా నటించిన బైకర్ ఈరోజే రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా ఇదే రోజు మరోసారి తన విడాకుల వార్త మరోసారి వైరల్ అవ్వడం గమనార్హం.

అప్పట్లోనే శర్వా-రక్షిత డివైడ్ అయిపోయారా ..

Advertisement

నిజానికి శర్వానంద్ విడాకుల గురించి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు.అప్పట్లోనే శర్వా-రక్షిత డివైడ్ అయిపోయారని, కూతురు సంరక్షణ కోసం కొన్ని రోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటోందన్న ప్రచారం జరిగింది.అయితే ఆ సమయంలో శర్వానంద్ టీమ్ స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలని, వారిద్దరూ కలిసే ఉన్నారని క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి అన్నీ డిలీట్ ?

Advertisement

ఇక అయితే వచ్చిన ప్రతీసారి అబ్బే అదంతా ఉత్తిదే అంటూ కొట్టిపారేసిన శర్వా తాజాగా తాజాగా శర్వానంద్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి భార్య రక్షితతో దిగిన పెళ్లి ఫోటోలు, ఎంగేజ్ మెంట్ ఫోటోలు , చివరకు తన ముద్దుల కూతురు లీలా దేవి మైనేనితో కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ (లేదా ఆర్కైవ్) చేసేశాడన్న టాక్ రావడం తో ఇపుడు మాత్రం డైవోర్స్ న్యూస్ నిజమే కాబోలు అంటూ కన్ఫాం చేసేసుకుంటున్నారు నెటిజనులు.పైగా శర్వా ప్రొఫైల్‌లో కేవలం సినిమాల పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ తో పాటు తన పర్సనల్ ఫోటోలు తప్పితే ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క క్లూ కూడా లేకపోవడం తో ఈ రూమర్స్ కి మరింత బూస్టప్ ఇస్తుంది.

also read:బాలయ్య …ది’ కింగ్ ఆఫ్ స్పీడ్’

2023 జూన్‌లో జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో

సాధారణంగా సెలబ్రిటీల మధ్య డిఫరెన్స్ వస్తే అది నెట్టింట్లోనే దర్శనం ఇస్తుంది.ఇపుడు శర్వా కూడా తాను ఇక సింగిల్ అని చెప్పడానికే ఇలా పిక్స్ డిలీట్ చేశాడని వినిపిస్తున్న టాక్.ఇక శర్వా పెళ్లి విషయానికి వస్తే 2023 జూన్‌లో జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో రక్షితతో పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.ఇక ఈ పెళ్ళికి చరణ్-ఉపాసన,సిద్ధార్థ్-అదితీ రావు వంటి స్టార్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు కూడా.ఇక పెళ్లయిన ఏడాదికే పాప పుట్టడం, ఆ పాపకు ‘లీలా దేవి’ అని పేరు పెట్టడం వంటి ఎన్నో మూమెంట్స్ నెట్టింట్లో పంచుకున్నాడు శర్వా. అలా అంతా హ్యాపీగా సాగిపోతుందనుకున్న టైం లో ఇపుడు అకౌంట్ లో పిక్స్ డిలీట్ చేయడం మిస్టరీగా మారింది.

కేవలం ప్రైవసీ కోసమేనా ?

అయితే కేవలం సినిమా విషయాలకే సోషల్ మీడియాలో ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పర్సనల్ పిక్స్ ని తీసేసాడు అంటూ శర్వా ఫ్యాన్స్ ఒకవైపు సపోర్ట్ చేస్తుంటే కేవలం ప్రైవసీ కోసమే అయితే కూతురి ఫోటోలను కూడా తీసేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు మరికొంత మంది యాంటి ఫ్యాన్స్.

శర్వా అండ్ టీమ్ ఎప్పుడు రియాక్ట్ అవుతారో

చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో డీసెంట్ హిట్ అందుకున్న సంగతి తెల్సిందే.ఇక ఈరోజే థియేటర్ లోకి వచ్చిన బైకర్ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఏది ఏమైనా ఈ టైం లో ఇలా డివోర్స్ మంటలు శర్వా ని చుట్టడం అంటే శర్వా కెరీర్ పై ఎఫెక్ట్ చూపించేవే.మరి తెగ సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై శర్వా అండ్ టీమ్ ఎప్పుడు రియాక్ట్ అవుతారో చూడాలి !

also read:ప్రభాస్ స్టైలిష్ విధ్వంసానికి 17 ఏళ్లు.. మెహర్ రమేష్ ‘ఫాస్టెస్ట్’ రికార్డ్ ఇదే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×