Sankranthi Clash: బాక్సాఫీస్ వద్ద ఏ ఇద్దరు హీరోలు బరిలోకి దిగినా అభిమానుల్లో ఉండే క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. అలాంటిది ఇద్దరు టాప్ హీరోలు పోటీ పడితే వచ్చే మజా మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి మజానే మరోసారి అందించడానికి రెడీ అయిపోయారు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున. యస్ ..రాబోయే 2027 సంక్రాంతి సీజన్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ ఈవెంట్
బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బరిలోకి దిగేందుకు సిద్దం అవుతుండగా, నాగ్ తన 100వ చిత్రం ‘లాటరీ కింగ్’తో బాలయ్యని డీ కొట్టబోతున్నాడట. అయితే ఇదే పొంగల్ బరిలోకి ఈ ఇద్దరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబో మూవీ, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల సినిమాలు కూడా రేసులో ఉండనుండటంతో పోటీ మరింత రంజుగా ఉండేలా కనిపిస్తుంది. ఒక వేళ ఇదే జరిగియ్తే మాత్రం టోటల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పకతప్పదు.
also read :రణ్వీర్ సింగ్‌పై బాలీవుడ్ నిషేధం…రూ. 45 కోట్ల వివాదంలో ఊహించని షాక్!
బాక్సాఫీస్ వార్ విషయానికి వస్తే
ఇక నాగ్, బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ విషయానికి వస్తే 1987 జనవరి 14న సంక్రాంతి రేసులో మొదటి సారి పోటీ పడింది ఈ జోడీ. బాలకృష్ణ పక్కా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ‘భార్గవరాముడు’తో వస్తే, నాగార్జున క్లాస్ మరియు ఎమోషనల్ లవ్ స్టోరీ ‘మజ్ను’తో పోటీ పడ్డారు. ‘భార్గవరాముడు’ రాయలసీమ లోని మాస్ సెంటర్లలో భారీ వసూళ్లు సాధిస్తే, ‘మజ్ను’ కోస్తాంధ్రా లోని క్లాస్ సెంటర్స్ లో కాసులు కొల్లగొట్టాడు.
ఇక అదే ఏడాది 1987 ఏప్రిల్ 8న అక్కినేని నాగేశ్వరరావు, నాగ్ కాంబినేషన్‌లో వచ్చిన హై-వోల్టేజ్ ఫ్యామిలీ డ్రామా ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ఇండస్ట్రీని షేక్ చేయగా, దానికి కేవలం ఐదు రోజుల గ్యాప్‌లో ఏప్రిల్ 13న విడుదలైన బాలయ్య ‘సాహస సమ్రాట్’ మాత్రం డిసప్పాయింట్ చేసింది.
also read :జగ్గూభాయ్ డబ్బింగ్ వీడియో వైరల్.. అప్పల సూరిగా థియేటర్లలో పూనకాలే!
ఆ తర్వాత 1987 నవంబర్ 12న నాగార్జున ‘కిరాయి దాదా’తో బాక్సాఫీస్ వద్ద సందడి సృష్టించగా, దానికి కౌంటర్‌గా నవంబర్ 19న బాలకృష్ణ ‘భానుమతి గారి మొగుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. విశేషం ఏంటంటే, ఈ రెండు చిత్రాలూ పరభాషా చిత్రాల రీమేక్‌లుగా వచ్చి కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం విశేషం.ఇక ఆ మరుసటి ఏడాది 1988 మే 6న నాగ్ ‘చినబాబు’గా, మే 11న బాలయ్య ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’గా పలకరించారు. అయితే ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ పల్స్ అందుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలిపోయాయి.
ఇక 1989 అక్టోబర్ 5న రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ విడుదలై సంచలనం సృష్టిస్తుండగా, అక్టోబర్ 13న ‘బాలగోపాలుడు’ చిత్రంతో వచ్చారు బాలకృష్ణ. ఓపెనింగ్స్ లో బాలయ్య మాస్ పవర్ చూపించినప్పటికీ, లాంగ్ రన్‌లో ‘శివ’ సాధించిన విజయ ప్రభంజనం ముందు ‘బాలగోపాలుడు’ నిలవలేకపోయిందనే చెప్పాలి.
also read :స్టార్ హీరోలకే దిక్కులేదు… కిరణ్ అబ్బవరం వంద కోట్లు కొడతాడా?
ఇక 1991 ఫిబ్రవరి 9న బాలకృష్ణ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ నిండిన ‘తల్లిదండ్రులు’ చిత్రంతో విజయం అందుకోగా, ఫిబ్రవరి 21న విడుదలైన నాగార్జున క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘నిర్ణయం’ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక 1994 ఏప్రిల్ 14న సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ ‘భైరవద్వీపం’ విడుదలై క్లాసిక్ హిట్ కాగా, దానికి సరిగ్గా ఆరు రోజుల వ్యవధిలో ఏప్రిల్ 20న ఇవివి సత్యనారాయణ మార్కు హిలేరియస్ కామిక్ ఎంటర్‌టైనర్ ‘హలో బ్రదర్’తో థియేటర్లలోకి వచ్చారు నాగ్. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచినప్పటికీ, లాంగ్ రన్ రన్నింగ్ మరియు టోటల్ గ్రాస్ కలెక్షన్స్ పరంగా ‘భైరవద్వీపం’ కాస్త పై చేయి సాధించింది.
ఆ తర్వాత 1996 సంక్రాంతి రేసులో సరిగ్గా ఒకే రోజు అంటే జనవరి 5న ఇద్దరూ తలపడ్డారు. బాలయ్య ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘వంశానికొక్కడు’తో రాగా, నాగ్ ‘వజ్రం’తో వచ్చారు. ఈ పొంగల్ ఫైట్‌లో ‘వంశానికొక్కడు’ భారీ వసూళ్లతో క్లీన్ విన్నర్‌గా నిలిచింది.
ఇక 2004 డిసెంబర్ 15న బాలకృష్ణ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘విజయేంద్రవర్మ’తో రాగా, డిసెంబర్ 23న నాగార్జున కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ మాస్ ఫిల్మ్ ‘మాస్’తో వచ్చారు. ఈ పోరులో ‘మాస్’ చిత్రం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసి నాగ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
also read :పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్….టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్!
ఎవరు పై చేయి సాధిస్తారో
ఆ తర్వాత సరిగ్గా 12 ఏళ్ల విరామం తర్వాత 2016 సంక్రాంతి పండగ బరిలో ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ మళ్లీ అమీతుమీ తేల్చుకున్నారు. బాలకృష్ణ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డిక్టేటర్’తో జనవరి 14న రాగా, నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్ సోషియో-ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ‘సోగ్గాడే చిన్నినాయనా’తో జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పొంగల్ వార్‌లో ‘సోగ్గాడే చిన్నినాయనా’ నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం.
ఇక ఇప్పటి వరకు సంక్రాంతి సీజన్ లో వీరి క్లాష్ ని చూస్తె మూడు సార్లు వీరి మధ్య పోటీ జరగ్గా ఒకసారి ఇద్దరూ సమానంగా నిలిచారు, మరోసారి బాలయ్య, ఇంకోసారి నాగార్జున సత్తా చాటారు.మరి వచ్చే పొంగల్ బరిలో దిగనున్న బాలయ్య ,నాగ్ లలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి .