E-Paper
Advertisement

ఫైనల్లీ విడుదలకు సిద్ధమైన విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్?

ఫైనల్లీ విడుదలకు సిద్ధమైన విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్?
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం విశ్వంభర(Vishwambhara). సోసియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత రెండు సంవత్సరాల క్రితం ప్రకటించి షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా 2025 సంవత్సరంలోనే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా వరుసగా వాయిదా పడుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి కారణం లేకపోలేదు.

జులై 10న రాబోతున్న విశ్వంభర?

ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. మంచి క్వాలిటీతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర నిర్మాతలు తరచు ఈ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులన్నీ దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలకు చిత్ర నిర్మాతలు ముహూర్తం ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ సమాచారం. ఇక ఈ చిత్రాన్ని జులై 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

చిరంజీవి జోడిగా త్రిష..

Advertisement

ఇప్పటికే సినిమా విఎఫ్ఎక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా దాదాపు పూర్తి అయ్యాయని, త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా చిరంజీవి జోడిగా త్రిష నటించబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగా 158 పూజా కార్యక్రమం..

Advertisement

నిజానికి ఈ సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు కంటే ముందుగానే విడుదల కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలోనే వాయిదా పడుతూ వస్తోంది. చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశ్వంభరపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక
చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ పూజ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతోంది.

Also Read: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యరెడ్డిల పెళ్లి తేదీ ప్రకటన.. ఘనంగా లగ్నపత్రిక వేడుక!

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×