E-Paper
Advertisement

నిరుద్యోగులకు సువర్ణవకాశం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో ఉద్యోగాలు, విద్యార్హత ఇదే

నిరుద్యోగులకు సువర్ణవకాశం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో ఉద్యోగాలు, విద్యార్హత ఇదే

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో సైంటిఫిక్.. టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 153 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు షార్ట్ నోటిఫికేషన్ జారీ అయింది. టెక్నాలజీ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే నిపుణులకు ఇది గొప్ప అవకాశం.

మొత్తం పోస్టుల సంఖ్య: 153

మొత్తం 153 పోస్టుల్లో సైంటిస్ట్-సి విభాగంలో 12 ఖాళీలు ఉన్నాయి. సైంటిస్ట్-డి విభాగంలో అత్యధికంగా 141 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లోని వివిధ ప్రాజెక్టులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (B.E/B.Tech) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఎంఎస్సీ (M.Sc), ఎంఈ (M.E), ఎంటెక్ (M.Tech), ఎంఫిల్ (M.Phil) పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఈ పోస్టులకు కేవలం విద్యార్హతలు ఉంటే సరిపోదు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత కాలం పాటు వృత్తిపరమైన అనుభవం తప్పనిసరి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పనిలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.

వయస్సు: సైంటిస్ట్-సి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు. సైంటిస్ట్-డి పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

జీతం: వేతనాల విషయానికొస్తే సైంటిస్ట్-సి అభ్యర్థులకు నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు లభిస్తుంది. సైంటిస్ట్-డి అభ్యర్థులకు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు జీతభత్యాలు అందుతాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపికలో అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ కీలక పాత్ర పోషిస్తాయి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. జనరల్ అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించడానికి 2026 ఏప్రిల్ 30 చివరి తేదీగా నిర్ణయించారు.

ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగ నిపుణులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ రంగంలో స్థిరపడవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.nic.in/

ALSO READ: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. 9,212 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×