E-Paper
Advertisement

Chiranjeevi Wish: సుస్మిత కొణిదెలపై మెగాస్టార్‌కు ఎంత ప్రెమంటే?.. ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది..

Chiranjeevi Wish: సుస్మిత కొణిదెలపై మెగాస్టార్‌కు ఎంత ప్రెమంటే?.. ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది..
Advertisement

Chiranjeevi Wish: మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒక గొప్ప తండ్రి అని మరోసారి నిరూపించుకున్నారు. తన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదల పుట్టినరోజును పురస్కరించుకుని, ఆమె పట్ల తనకున్న ప్రేమనంతా కురిపిస్తూ ఒక అద్భుతమైన సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి తన పోస్ట్‌లో సుస్మిత ఎదుగుదల గురించి ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు తన వేలు పట్టుకుని నడిచిన చిన్నారి, ఈరోజు ఇంత బాధ్యతాయుతమైన స్త్రీగా ఎదగడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఒక తండ్రిగా తనకు అత్యంత గర్వకారణమైన విషయం గురించి ఇలా రాసుకొచ్చారు.

Read also-Aspirants Season 3 OTT : మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే

Advertisement

ఒకప్పుడు తన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసిన కూతురు, ఈరోజు తనే నిర్మాతగా మారి తనకు ఒక మెమరబుల్ బ్లాక్‌బస్టర్ అందించడం చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. సుస్మితను ఎంతో ఇష్టంగా ‘హనీ పాప’ అని పిలుస్తూ తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందేశంతో పాటు చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సుస్మిత చిన్నప్పటి అరుదైన ఫోటోలతో పాటు, ప్రస్తుతం ఆమె సాధించిన విజయాలను ప్రతిబింబించే చిత్రాలను ఆయన జత చేశారు. “నా వేలు పట్టుకుని నడిచిన చిన్నారి నుంచి, ఈరోజు ఒక బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగిన నీ ప్రయాణం నాకు ఎంతో గర్వకారణం.” అంటూ రాసుకొచ్చారు.

Read also-Peddi Movie : రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన ‘పెద్ది’.. థియేటర్లు బద్దలవ్వాల్సిందే సామి..!

Advertisement

మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. “తండ్రీకూతుళ్ల బాండింగ్ అంటే ఇదే” అని కొందరు, “హ్యాపీ బర్త్‌డే సుస్మిత” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సుస్మిత ప్రస్తుతం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ హీరోగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×