E-Paper
Advertisement

Peddi Movie : రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన ‘పెద్ది’.. థియేటర్లు బద్దలవ్వాల్సిందే సామి..!

Peddi Movie : రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన ‘పెద్ది’.. థియేటర్లు బద్దలవ్వాల్సిందే సామి..!

Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటుగా.. చెర్రీ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. రోజురోజుకీ ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల రిలీజైన రై రై రారా పాట జనాల్లో ఒక ఊపును తీసుకొని వచ్చింది.. దాంతో మూవీ పై మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఊహించని రీతిలో ఊపందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకముందే అంచనాలు ఈ రేంజ్ లో ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ బిజినెస్ వివరాలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి… ఒక్క మాటలో చెప్పాలంటే రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఒకసారి ఈ మూవీ బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

‘పెద్ది’థియేట్రికల్ బిజినెస్‌!

ఈ చిత్రం నుంచి బయటకొచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మంచి బజ్ని క్రియేట్ చేసుకోవడంతో ఈ మూవీ ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే 2026లో అతి పెద్ద ఓపెనర్‌గా, భారీ రెవిన్యూ జనరేటర్‌గా ఈ చిత్రం నిలుస్తుందని డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా నమ్ముతున్నారు.. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.300 కోట్ల మార్కును తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. నైజాం ఏరియాలో ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అగ్ర నిర్మాతలు దిల్ రాజు, ఏషియన్ సునీల్ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు టాక్.. కర్ణాటకలో దాదాపు 40 కోట్లు, అలాగే ఓవర్సీస్ లో 25 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ ను చూస్తే రిలీజ్ కు ముందే రికార్డులు బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..

Also Read : ‘మై విలేజ్ షో ‘ నుంచి తప్పుకున్న అనిల్ జీలా .. ఏం జరిగిందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో పెద్ది బిజినెస్..

ఇక ఇతర రాష్ట్రాలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఈ మూవీ బిజినెస్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. సీడెడ్ ప్రాంతంలో 35 కోట్లు, కోస్టల్ ఆంధ్రలో సుమారు 85 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. నార్త్ లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉన్నటువంటి తెలుస్తుంది.. జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. అందుకే నార్త్ లో కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉండడంతో ఆయన బర్త్డే సర్ప్రైజ్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.. మరి ఆ ట్రైలర్ విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే ఈ మూవీ ఇప్పటికే మార్చి నుంచి ఏప్రిల్ కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. మరి ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ కు ఎలాంటి క్రేజ్ దక్కుతుందో చూడాలి…

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×