E-Paper
Advertisement

Aspirants Season 3 OTT : మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే

Aspirants Season 3 OTT : మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే
Advertisement

Aspirants Season 3 OTT : కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. స్టోరీ, నటనతో ఈ సిరీస్ లు ఆడియన్స్ ను ఇట్టే ఆకట్టుకుంటాయి. వాటిలో ‘ఆస్పిరెంట్స్’ సిరీస్ కూడా ఒకటి. సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల చుట్టూ సాగే ఈ కథ, ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. టీవీఎఫ్ (TVF) వారి అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ఆస్పిరెంట్స్’ (Aspirants) సీజన్ 3 ఇప్పుడు విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటకే వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీజన్ 3 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న ఈ సీజన్ 3 కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మరి ఈ సీజన్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

దీపేష్ సుమిత్ర జగదీష్ దర్శకత్వంలో ఈ ‘ఆస్పిరెంట్స్’ (Aspirants) సీజన్ 3 రూపొందింది. ఇందులో నవీన్ కస్తూరియా (అభిలాష్), సన్నీ హిందుజా (సందీప్ భయ్యా), శివాంకిత్ సింగ్ పరిహార్ (గురి), అభిలాష్ థప్లియాల్ (SK) తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. ఈ సీజన్‌లో జతిన్ గోస్వామి కొత్తగా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక సీజన్ 1: 2021 ఏప్రిల్ 7 న, సీజన్ 2 : 2023అక్టోబర్ 25న స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్ 2026 మార్చి 13న Amazon Prime Video లో ప్రీమియర్ కానుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సీజన్ రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో సాగుతుంది. ఒకటి అభిలాష్ ప్రస్తుత అధికారిక జీవితం, మరొకటి అతని పాత ముఖర్జీ నగర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ రోజులు. ట్రైలర్ ప్రకారం, ప్రస్తుత కాలంలో అభిలాష్, సందీప్ భయ్యాల మధ్య ఒక రకమైన లీగల్ వార్ లేదా ప్రొఫెషనల్ శత్రుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అభిలాష్ IRS అధికారిగా ఎంపికైన తర్వాత, చివరి ప్రయత్నంగా IAS కోసం ముఖర్జీ నగర్‌లో మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టిన రోజులను చూపిస్తుంది. ప్రస్తుత కాలంలో జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అభిలాష్‌పై, సందీప్ భయ్యా చేసిన కొన్ని ఆరోపణల వల్ల అధికారిక విచారణ మొదలవుతుంది. ఇది వాళ్ళ స్నేహానికి, కెరీర్‌కు పెద్ద పరీక్షగా మారుతుంది.

Read Also : పొదుపు పేరుతో పాడు పని… మొగుళ్ళను కాదని మరొకరితో… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×