E-Paper
Advertisement

husband’s income: భర్త ఆదాయం పెరగాలంటే – భార్య ఈ నియమాలు పాటించాలట

husband’s income: భర్త ఆదాయం పెరగాలంటే – భార్య ఈ నియమాలు పాటించాలట

husband’s income: భర్త ఆదాయం పెరగాలంటే భార్యల తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలట. అలా చేసినప్పుడే రూపాయి సంపాదించని భర్త కూడా కోట్లు సంపాదించే వ్యక్తిగా మారపోతాడని పండితులు చెప్తున్నారు. ఆ నియమాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

నుదుటన కుంకుమ ధరించాలి:

సౌభ్యాగ్యవతి అయిన ఏ మహిళ అయినా తన భర్త ఆదాయం పెరగాలంటే నిరంతరం ఎప్పుడూ నుదుటన, పాపిటలో కుంకుమ ధరించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా ఏ మహిళ అయితే చేస్తుందో ఆ మహిళ భర్తకు ఆదాయ బాగా పెరుగుతుందట. చేస్తున్న వృత్తిలో కలిసొస్తుందట.

ఎరుపు రంగు మట్టి గాజులు ధరించాలి:

ప్రతి స్త్ర చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు ధరించడం వల్ల ఆమె భర్తకు ఆదాయం దండిగా పెరుగుతుందట. ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్‌ అందుకే ఎరుపు రంగా గాజులు ధరించే వారి భర్తలకు ఆర్థికరపమైన పురోగతి చాలా స్పీడుగా ఉంటుందని పండితులు చెప్తున్నారు.

యాలకుల ప్రయోగం:

ప్రతి స్త్రీ తన భర్త పర్సులో 5 యాలకులు పెడుతుండాలట. ఇలా చేయడం వల్ల కూడా వారి భర్తలకు ఆదాయం పెరుగుతుందట. అయితే ఈ యాలకులను తరచుగా మారుస్తుండాలని సూచిస్తున్నారు.

శివాభిషేకం చేయడం:

ఏ స్త్రీ అయితే తన భర్త ఆదాయం పెరగాలని కోరుకుంటుందో.. ఏ మహిళ అయితే తన భర్త ఆర్థికంగా అభివృద్ది సాధించాలని అనుకుంటుందో అటువంటి స్త్రీ కచ్చితంగా ప్రతి సోమవారం దగ్గరలోని శివాలయంలో పరమశివుడికి అభికషేకం చేయించాలట. ఒకవేళ శివాలయం అందుబాటులో లేకపోతే.. ఇంట్లో దేవుడి దగ్గర  తమ బొటికన వేలంతా శివలింగం ఉంచుకుని అభిషేకం పూజలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు పండితులు.

అమ్మవారికి నైవేద్యంగా ఎండుద్రాక్ష:

ఏ స్త్రీ అయితే తన భర్త కోటీశ్వరుడు కావాలని కోరుకుంటుందో.. తన కుటుంబం కోట్లకు పడగలెత్తాని ఆశిస్తుందో ఆ స్త్రీలు శుక్రవారం అమ్మ వారి గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని నైవేద్యంగా ఎండు ద్రాక్ష పెడుతుందో వారి భర్తలకు ఆదాయం పెరుగుతుందట. గుడిలో కుదరని వాళ్లు ఈ పూజ ఇంట్లో అయినా చేసుకోవచ్చట. ఇలా అమ్మవారికి నైవేద్యంగా ఎండుద్రాక్ష పెడతారో వాళ్లకు వద్దన్నా డబ్బు ప్రవాహంలా పారుతుందట.

మంగళసూత్రం పవిత్రంగా ఉంచుకోవడం:

చాలా మంది మహిళలు మంగళసూత్రానికి పిన్నిసులు.. లేదా ఇతర ఏవైనా వస్తువులు పెట్టుకుంటుంటారు. అలా పెట్టడం పెద్ద దోషమట. ఇలా చేయడం వల్ల్ వారి భర్తలకు ఆదాయం ఆగిపోతుందట. కోట్లు సంపాదించే భర్తలకు కూడా పైసా ఆదాయం లేకుండా పోతుందట. కాబట్టి మహిళలు ఎప్పుడూ కూడా మంగళసూత్రానికి పిన్నిసులు వేరే ఏవీ పెట్టరాదట.

శుక్రవారం గాజులు కొనడం:

చాలా మంది మహిళలు గాజులు కొంటుంటారు. అయితే ప్రత్యేకించి ఎవ్వరూ కూడా గాజులు కొనడానికి ముహూర్తాలు ఏమీ చూడరు కానీ శాస్త్రం ప్రకారం శుక్రవారం గాజులు కొంటే వారి భర్తల ఆదాయం రెట్టింపు అవుతుందని పరిహారశాస్త్రంలో ఉందట. కాబట్టి మహిళలు ఎప్పుడైనా శుక్రవారం చూసుకుని గాజులు కొనడం మంచిదని సూచిస్తున్నారు పండితులు.

ఇంటి ముందు ముగ్గు వేయడం:

ప్రతిరోజు ఉదయమే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయడం కూడా ఆ ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీకి కారణం అవుతుందట. అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవికి వెల్‌కం చెప్పినట్టు అవుతుందట. ఏ మహిళ అయితే ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తుందో ఆ మహిళ భర్తకు తప్పకుండా ఆదాయం పెరుగుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని మార్పులు

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×