E-Paper
Advertisement

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Advertisement

దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదరు చూసిన వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ తాజాగా పట్టాలెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ.. బెంగాల్ లోని మాల్దాలో ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హౌరా-గౌహతి మధ్య సర్వీసులు అందిస్తోంది. తాజాగా ఈ రైలుకు సంబంధించి అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. కన్ఫార్మ్ టికెట్లను క్యాన్సిల్ చేస్తే పెద్ద మొత్త మొత్తంలో ఛార్జ్ విధించనున్నట్లు తెలిపారు.

ఏకంగా 50 శాతం ఛార్జ్ విధింపు

ఈ ప్రీమియం రైలులో బుక్ చేసుకున్న టికెట్ రద్దు చేసుకుంటే 25% తగ్గింపు వర్తిస్తుంది. రైలు షెడ్యూల్ టైమ్ కు 72 గంటల నుంచి ఎనిమిది గంటల ముందు వరకు క్యాన్సిల్ చేసుకుంటే ఏకంగా 50% ఛార్జ్ విధించబడుతుంది. ఎనిమిది గంటల కంటే తక్కువ సమయం ముందు టికెట్ రద్దు చేసుకుంటే, ఎలాంటి రీఫండ్ ఉండదని వెల్లడించారు. ఇండియన్ రైల్వే నిర్ణీత రైళ్లు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ చార్ట్‌ ను రెడీ చేస్తున్న నేపథ్యంలో ఈ రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇతర రైళ్లతో పోల్చితే సరికొత్త రూల్స్

Advertisement

వందే భారత్ స్లీపర్ రైళ్లకు కొత్త రూల్స్ ను అందుబాటులో తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే. వందే భారత్ చైర్ కార్ రైళ్లతో సహా ఇతర రైళ్లతో పోలిస్తే చాలా భిన్నంగా, కఠినంగా ఉంటాయి. ఈ సర్వీసులలో ప్రయాణీకులకు కన్ఫార్మ్ టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. టికెట్లను రద్దు చేసుకునే సమయాన్ని ఈ నిబంధనలు తగ్గిస్తాయని, వందే భారత్ స్లీపర్ రైళ్లకు రీఫండ్  మొత్తాలను మారుస్తాయని అధికారులు తెలిపారు.

ఏ క్లాస్ కు ఎంత ఛార్జ్ పడుతుందంటే?

ఇతర రైళ్ల నిబంధనల ప్రకారం, రైలు షెడ్యూల్ టైమ్ కు 48 గంటల ముందు ఎప్పుడైనా టికెట్లను రద్దు చేసుకుంటే, ప్రయాణీకులకు ఫస్ట్ ఏసీకి రూ. 240, టైర్ 2 ఏసీకి రూ. 200, టైర్ 3 ఏసీకి రూ. 180, స్లీపర్‌కు రూ. 120, సెకండ్ క్లాస్‌కు రూ. 60 ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జ్ ఉంటుంది. షెడ్యూల్ టైమ్ కు 48 గంటల నుంచి 12 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేసుకుంటే, 25% క్యాన్సిలేషన్ ఛార్జీ విధించబడుతుంది. రైలు బయలుదేరడానికి 12 గంటల నుంచి నాలుగు గంటల ముందు వరకు క్యాన్సిల్ చేసిన టికెట్లకు 50% తగ్గింపు ఉంటుంది. కన్ఫార్మ్ టికెట్లు రద్దు చేయకపోతే, రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు టికెట్ డిపాజిట్ రసీదు (TDR) ఆన్‌ లైన్‌లో దాఖలు చేయకపోతే రీఫండ్ లభించదని రైల్వే రూల్స్ చెప్తున్నాయి.

Advertisement

ఇక వందే భారత్ స్లీపర్ రైళ్ల ఛార్జీలకు సంబంధించి, కనీస ఛార్జీ విధించే దూరం 400 కి.మీ ఉంటుంది. మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ ఉన్నవారికి మాత్రమే కోటా ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇతర రిజర్వేషన్లు వర్తించవని అధికారులు వెల్లడించారు. సో, ఇకపై వందేభారత్ స్లీపర్ రైలు టికెట్లు బుక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. క్యాన్సిల్ చేసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది.

Read Also: వందేభారత్ లో నో వీఐపీ కల్చర్, రైల్వేమంత్రి కీలక ప్రకటన!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×