E-Paper
Advertisement

మిస్ యూనివర్స్ ఐతే ఎవరికి గొప్ప.. నాటి అవమానాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా!

మిస్ యూనివర్స్ ఐతే ఎవరికి గొప్ప.. నాటి అవమానాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా!
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటాన్ని చేజిక్కించుకున్న ఈమె.. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ ఆ సమయంలో నటన రాక.. డాన్స్ పెద్దగా చేయకపోవడంతో ఎంతోమంది ఈమెను అవమానించారట. ఈ విషయాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా సినీ ప్రయాణం మొదట్లో డాన్స్ సరిగ్గా రాక విమర్శల పాలయ్యింది.. సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్.. సెట్ లో మైక్ విసిరేసి తిట్టిన చేదు జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.

కొరియోగ్రాఫర్ నాపై మండిపడ్డారు – ప్రియాంక చోప్రా

సాధారణంగా మనకు ప్రియాంక చోప్రా అంటే వెంటనే గుర్తొచ్చేది ఆమె అద్భుతమైన నటన.. అదిరిపోయే డాన్స్ స్టెప్పులు.. అలాంటిది ఆమె అదే డాన్స్ విషయంలో ఇబ్బందులు పడ్డారు అంటే ఎవరైనా నమ్మగలరా.. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే అవుననే చెబుతోంది ఈ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”నేను సినిమాలలోకి వచ్చిన కొత్తలో చాలా దారుణంగా డాన్స్ చేసేదాన్ని. ఒకవైపు నటన , మరొకవైపు కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్.. ఇవన్నీ ఒకేసారి చేయడం అంటే నా వల్ల కాలేదు. ఇక దాంతో కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశా. రు నువ్వు ఏదో అందాల పోటీల నుంచి వచ్చి ఉండొచ్చు.. నువ్వు మిస్ యూనివర్స్ అయి ఉండొచ్చు.. ఎవరికి గొప్ప.. కానీ నటి కావాలంటే ముందు డాన్స్ నేర్చుకో అంటూ మైక్ కింద పడేసి సెట్ నుంచి కోపంతో వెళ్లిపోయారు . ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను.. తల కొట్టేసినట్టు అనిపించింది” అంటూ నాటు చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

కత్రినా కైఫ్ వల్లే సాధ్యపడింది..

Advertisement

నాటి అవమానాలను దృష్టిలో పెట్టుకొని..పట్టుదలతో శ్రమించి దేశీ గర్ల్ , రామ్ చాహే లీలా వంటి పాటలతో అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది ప్రియాంక చోప్రా. ఇకపోతే డాన్స్ లో తనకు సహాయం చేసింది మాత్రం కత్రినా కైఫ్. అప్పటికే కత్రినా మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకోవడం.. అదే సమయంలో ఆ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటించడం వల్లే ఆమె దగ్గర డాన్స్ లో మెళుకువలు నేర్చుకుంటూ రోజుకు ఆరు గంటల పాటు ప్రియాంక ప్రాక్టీస్ చేసేవారట. అలా తనను మలుచుకొని నేడు అంతర్జాతీయంగా ఎదిగారు ప్రియాంక చోప్రా. ఇకపోతే ఇప్పుడు నాడు తనపై అరిచిన కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ ఇప్పుడు ప్రియాంకకి మంచి స్నేహితుడు కావడం గమనార్హం.

also read:స్టార్ సింగర్ పై మ్యూజిక్ డైరెక్టర్ లైంగికదాడి… నేనే కాదు చాలామంది అమ్మాయిలు అంటూ!

ప్రియాంక చోప్రా సినిమాలు…

Advertisement

ప్రియాంక చోప్రా సినిమాలు విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న టైం ట్రావెల్ అడ్వెంచర్ మూవీ వారణాసిలో ప్రియాంక చోప్రా మందాకిని అనే కీలకపాత్ర పోషిస్తుంది. 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇండియన్ స్క్రీన్ పై కనిపించనున్నారు ప్రియాంక చోప్రా. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుంది. ఓటీటీ చిత్రాల విషయానికి వస్తే.. ఈమె నటించిన ది బ్లఫ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచింది.అలాగే సిటాడెల్ సీజన్ 2 కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×