E-Paper
Advertisement

అన్న చేసిన తప్పుకు చెల్లి బలి.. వికారాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

అన్న చేసిన తప్పుకు చెల్లి బలి.. వికారాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
Advertisement

Vikarabad Suicide: వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తన అన్న చేసిన తప్పుకు, అతను నడిపిన ప్రేమ వ్యవహారానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 23 ఏళ్ల డేగావత్ తులసీబాయి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ధారూరు ప్రాంతానికి చెందిన తులసీబాయి వికారాబాద్‌లోనే ఒక గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆమె అన్న రాజు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న మౌనిక అనే యువతిని రాజు గత ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో మౌనికను తన చెల్లి ఉంటున్న గదిలోనే ఉంచాడు. అయితే.. ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో మౌనిక అక్కడి నుండి వెళ్లిపోయింది. కానీ రాజు మాత్రం ఆమెను వదలకుండా, గతంలో జరిగిన ఫొటోలు పంపిస్తూ వేధించడం మెుదలుపెట్టాడు.

Advertisement

ఈ వేధింపులు భరించలేక మౌనిక పోలీసులను ఆశ్రయించింది. రాజు తనను వేధిస్తున్నాడని, ఇందుకు అతని చెల్లి తులసీబాయి కూడా సహకరిస్తోందని ఫిర్యాదు చేసింది. పోలీసు ఉద్యోగంలో ఉండి, తన అన్న చేసిన పని వల్ల అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం, శాఖాపరంగా తన పరువు పోతుందన్న భయం తులసీబాయిని తీవ్రంగా కలచివేసింది. అన్న ప్రేమ వ్యవహారం తన మెడకు చుట్టుకుందన్న మనస్తాపంతో ఆమె తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. తులసీబాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్? ఇరాన్ 3 కండీషన్లు.. ట్రంప్ ఓకే అంటారా?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×