Tollywood:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే ఒక వార్త హాట్ టాపిక్ కావడమే కాకుండా అందరినీ టెన్షన్ పెడుతోంది. ఒక టాప్ పాన్ ఇండియా హీరోకి అత్యంత సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత అయిన వ్యక్తి కోసం సీఐడీ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు జరగడం, ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడంతో అరెస్ట్ తప్పదా అన్న చర్చ మొదలైంది. ఇక అసలు ఆయనపై ఉన్న ఆరోపణలేంటి? ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఆ వివరాలు ఇలా వున్నాయి..
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఒక స్టార్ హీరోకి నీడలా ఉండే ఆ ప్రముఖ నిర్మాత చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. సీఐడీ అధికారులు ఒక్కసారిగా ఆయనపై దృష్టి సారించడం టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అయితే అధికారులు వచ్చిన సమయంలో ఆయన అక్కడ లేకపోవడం, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆయన కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
ఈ విచారణ వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని భారీ ఆర్థిక లావాదేవీల్లో ఈయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల మళ్లింపు లేదా ప్రభుత్వానికి సంబంధించిన భూ వ్యవహారాల్లో ఈ నిర్మాత జోక్యం చేసుకున్నారనే అనుమానంతో సీఐడీ ఆరా తీస్తోంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని లబ్ధి పొందారనే కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా, సోషల్ మీడియాలో ఆయన పెట్టిన కొన్ని వివాదాస్పద పోస్టులు కూడా ఈ చిక్కులకు కారణమని మరో వాదన వినిపిస్తోంది. కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి కేసుల నేపథ్యంలో కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే పోలీసులు ఇప్పటికే ఆ నిర్మాత సన్నిహితులను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయంపై క్లారిటీ వస్తే నేడో రేపో అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ALSO READ:ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మంచు లక్ష్మీ ‘లేచింది మహిళా లోకం’!
ఈ నిర్మాతకు సదరు స్టార్ హీరోతో ఉన్న అనుబంధం కారణంగా ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన దొరికితే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ పరిణామాల వల్ల ఆ హీరోకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి సీఐడీ వేట ఎక్కడికి దారితీస్తుందో, ఆ నిర్మాత బయటకు వచ్చి లొంగిపోతారా లేదా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఫిల్మ్ నగర్లో ఈ “అజ్ఞాత” నిర్మాత గురించే రచ్చ జరుగుతోంది.