E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మంచు లక్ష్మీ ‘లేచింది మహిళా లోకం’!

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మంచు లక్ష్మీ ‘లేచింది మహిళా లోకం’!
Advertisement

Manchu Lakshmi:సాధారణంగా కొన్ని సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదల అయ్యాయో తెలియదు.. ఎప్పుడు థియేటర్ నుంచి తీసేసారో కూడా తెలియదు. కానీ సడన్ గా ఓటీటీలోకి వచ్చి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు ఓటీటీకి సిద్ధం అవుతూ.. అభిమానులలో అంచనాలు పెంచుతుంటాయి. అలాంటి చిత్రాలలో మంచు లక్ష్మీ లేచింది మహిళా లోకం సినిమా కూడా ఒకటి. వాస్తవానికి మార్చి 26వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అసలు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళ్ళింది? అన్నది కూడా ప్రేక్షకులకు తెలియని విధంగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ మినిమం టాక్ , కలెక్షన్లు కూడా ఈ సినిమాకు వచ్చినట్టు కనిపించడం లేదు. పైగా పుష్ప డైలాగు తనదే అంటూ మంచు లక్ష్మి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగానే కామెంట్లు చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఎక్కడా కూడా ఈ సినిమా ప్రస్తావన లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయిన లేచింది మహిళా లోకం..

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది..అనన్య నాగళ్ల , హరితేజ, హేమ, సుప్రీతా, శ్రద్ధాదాస్ ఇలా చాలామంది మహిళా ఆర్టిస్టులు లేచింది మహిళా లోకం సినిమాలో కనిపించారు. అయితే ఈ చిత్రానికి ఇలాంటి పరిస్థితి రావడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అసలు థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అయింది ? ఎప్పుడు థియేటర్ నుంచి తీసేసారు? అనే విషయం కూడా తెలియలేదు కానీ అప్పుడే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఇక్కడైనా ఈ సినిమా సౌండ్ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Advertisement

ఈ సినిమా విషయానికి వస్తే.. లేచింది మహిళా లోకం సినిమాలో లింగ వివక్ష, భార్యాభర్తల సంబంధాలు, విడాకుల చుట్టూ తిరిగే కామెడీ ఎంటర్టైనర్ ఇది. మార్చి 26 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది .సన్ నెక్స్ట్ లో ఈ సినిమా ఏప్రిల్ 22 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అలాగే సుప్రీత అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా అనౌన్స్ చేశారు. అసలే థియేటర్లలో ఏమాత్రం టాక్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కనీసం ఓటీటీ లోనైనా ఆదరిస్తారా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

నిర్మాతగా ఇండస్ట్రీకి దూరం అయినట్టేనా?

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో మంచు లక్ష్మీ కొన్ని విషయాలను తెలిపింది. కానీ నిర్మాతగా నష్టపోయానని.. అందుకే తనను నిర్మాతగా దృష్టిలో పెట్టుకొని తన వద్దకు రాకుండా.. నటిగా తన వద్దకు పాత్రలని, కథల్ని చెప్పేందుకు రావాలి అని సూచించింది. మొత్తానికైతే నిర్మాతగా మంచు లక్ష్మి దాదాపుగా సినిమాలకు దూరమైందనే చెప్పాలి. మరి ఈ సినిమా ఓటీటీలోనైనా సందడి చేస్తుందో లేదో చూడాలి.

Advertisement

also read:Bhooth Bangla Movie Review: భూత్ బంగ్లా రివ్యూ.. దెయ్యం భయపెట్టదు కానీ?

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×