E-Paper
Advertisement

స్లీపర్ బస్సులు బ్యాన్.. ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!

స్లీపర్ బస్సులు బ్యాన్.. ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!
Advertisement

Sleeper Buses May Be Banned in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ స్లీపర్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతూ, ప్రయాణీకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తోంది.

కీలక విషయాలు వెల్లడించిన ఏపీ రవాణాశాఖ మంత్రి

స్లీపర్ బస్సుల నిషేధంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. స్లీపర్ బస్సుల్లో ఫిట్‌ నెస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. అందుకే ఈ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు కూడా కొత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణ దూరం ఆధారంగా గమ్యానికి చేరే సమయాన్ని ముందుగానే నిర్ణయించి, దానికంటే త్వరగా చేరే బస్సులను నగరాల్లోకి అనుమతించకూడదని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు వేగంగా నడపకుండా నియంత్రణలో ఉంచాలని ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

బస్సు ప్రమాద కారణాలపై అధ్యయం

Advertisement

అదే సమయంలో, వరుస ప్రమాదాల కారణాలను అర్థం చేసుకునేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)తో కలిసి ఒక అధ్యయనం కూడా నిర్వహించారు. ఈ నివేదికలో బస్సుల తయారీ లోపాలు, టెక్నికల్ సమస్యలు, నిబంధనల ఉల్లంఘనలు లాంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ASCI నివేదిక ప్రకారం, స్లీపర్ బస్సులపై పూర్తి నిషేధం విధించాలని సూచించారు. మొదటి నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి, రెండో నెలలో కొత్త స్లీపర్ బస్సుల తయారీని ఆపాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న స్లీపర్ బస్సులను దాదాపు ఏడాదిన్నరలోపు సీటర్ బస్సులుగా మార్చాలని సూచించారు. రెండు సంవత్సరాల్లో పూర్తిగా ఈ బస్సులు రోడ్లపై కనిపించకుండా చేయాలని నివేదిక వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో కలిసి ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను 80 శాతం యాజమాన్యాలు పాటించడం లేదని ఈ నివేదిక తెలిపింది.

అటు ఇతర దేశాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ఉదాహరణలను నివేదికలో నిపుణులు ప్రస్తావించారు.  చైనాలో 2012లో జరిగిన ఒక ప్రమాదం తర్వాత డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులపై నిషేధం,  జర్మనీ, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాలు కూడా కఠిన నిబంధనలను గుర్తు చేశారు.

ప్రయాణికుల భద్రత పెంచేందుకు కీలక నిర్ణయాలు

Advertisement

మరోవైపు భద్రతను పెంచేందుకు మరో ముఖ్యమైన చర్యగా, 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండేలా ఏపీ సర్కారు నిర్ణయించింది. రాత్రిపూట డ్రైవింగ్ చేసే డ్రైవర్ విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సీటు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయడానికి రూ.40 కోట్లు కేటాయించారు. అదేవిధంగా బస్సుల్లో కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవర్ ప్రవర్తనను పర్యవేక్షించనున్నారు. కర్నూలు ప్రమాదం తర్వాత 50 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

Read Alos: అసలే ఆలస్యం, ఆపై నో ఏసీ.. ప్రయాణీకులకు చుక్కలు చూపించిన ఇండిగో!

Related News

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×