E-Paper
Advertisement

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. దేశ రాజకీయ పరిణామాలు, పొత్తుల ప్రభావంపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జతకట్టిన ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే బీజేపీతో వెళ్లే పార్టీల మనగడ కష్టమని అభిప్రాయపడ్డారు.

బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకుని వదిలేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు నితీష్ కుమార్, ఏక్ నాథ్ షిండే ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమని చెప్పారు. ఇదే బాటలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం భవిష్యత్తులో చేదు అనుభవాలు తప్పవని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ లేని కారణంగానే టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే చంద్రబాబును పక్కన పడేయడం ఖాయమని స్పష్టం చేశారు.

Advertisement

పార్లమెంటు వ్యవస్థపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ అనేవి కేవలం చట్టాలు చేయడానికి మాత్రమే పరిమితమని గుర్తుచేశారు. ఆ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంపైనే ఉంటుందని తెలిపారు. కేంద్రంలో 2/3 వంతు మెజార్టీ వచ్చినంత మాత్రాన ఇష్టానుసారంగా చట్టాలు చేయలేరని చెప్పారు. సంఖ్యాబలం ఉందని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తనను తాను రాజుగా ప్రకటించుకుని చట్టం చేసుకుంటే ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యానించారు.

దేశంలో డిక్టేటర్ షిప్ నడవదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయని.. అంతమాత్రాన తాను ఏపీకి రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ప్రజలు ఊరుకోరని ఉదహరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంటుందని హితవు పలికారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై స్పందిస్తూ.. 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలని సూచించారు.

Advertisement

Also Read: బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×