BigTV English

Tollywood Hero : నీకు కాదు.. నాకు నచ్చినట్టు సినిమా చేయు… డైరెక్టర్‌ని ఫోర్స్ చేస్తున్న హీరో ?

Tollywood Hero : నీకు కాదు.. నాకు నచ్చినట్టు సినిమా చేయు… డైరెక్టర్‌ని ఫోర్స్ చేస్తున్న హీరో ?
Advertisement

Tollywood Hero : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు ఎప్పుడు డిమాండ్ ఉండనే ఉంటుంది.. అందులోనూ స్టార్ హీరోల కైతే చెప్పనక్కర్లేదు. వాళ్లతో సినిమాలు చేయాలని ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లు పోటీ పడుతుంటారు. ఈమధ్య స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాలలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. డైరెక్టర్లు సైతం అలానే స్టోరీలు రాస్తూ హీరోలకు వినిపిస్తూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామనే సందేహం అందరికీ రావచ్చు.. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఓ స్టార్ హీరో VS డైరెక్టర్ మధ్య జరుగుతున్న వార్ దీనికి కారణం.. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలోనూ.. సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ గొడవలకు కారణం ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


 డైరెక్టర్ తో హీరోకు గొడవ..? 

ఒక సినిమాని తెరకెక్కించాలంటే డైరెక్టర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ సినిమాకు అంతకుమించి అవుట్ ఫుట్ ఇవ్వడానికి హీరో కూడా బాగా కష్టపడాలి. వారిద్దరి మధ్య సఖ్యత ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది అని చాలామంది డైరెక్టర్లు నిరూపించారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరోకి, అలాగే స్టార్ డైరెక్టర్ కి మధ్య గొడవ జరిగిందంటూ టాక్.. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ స్టార్ హీరో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఆగిపోయింది అంటూ ఓ బాంబు లాంటి న్యూస్ చెవిన పడింది. డైరెక్టర్ తో హీరో గొడవ అందుకే సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. హీరోకి డైరెక్టర్ ఇచ్చిన అవుట్ పుట్ నచ్చకపోవడంతోనే ఈ గొడవ పెద్దదైందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోనే షూటింగ్ మధ్యలోనే హీరో వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. మరి దీనిపై నిర్మాత ఇద్దరినీ బుజ్జగిస్తారా? లేదా ఈ సినిమా నుంచి డైరెక్టర్ లేదా హీరో తప్పుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే.

Also Read: ‘థామా’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టిందా..?


డైరెక్టర్ కు హీరో వార్నింగ్.. 

డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని నిర్మాత చెప్పడంతోనే హీరో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు డైరెక్టర్ ను సినిమాకు ఒప్పించింది కూడా హీరోనే అంటూ గతంలో వార్తలు కూడా వినిపించాయి.. అన్ని చేసిన హీరో ఇప్పుడు అవుట్ ఫుట్ బాగోలేదంటూ డైరెక్టర్ ను విమర్శించడం సబబు కాదు అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా డైరెక్టర్ చెప్పినట్లు సినిమా ఉంటుంది.. కానీ హీరోకు నచ్చినట్లు సినిమా ఉండదు కదా అని నెట్టింటా ఓ రేంజ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఆ సినిమా కొన్ని నెలలు ఆగిపోయినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సడన్గా ఆగిపోవడంతో నిర్మాతకు భారీ నష్టం జరిగింది. మరి నిర్మాత ఇద్దరి మధ్య సంధి కుదురుస్తాడా..? లేదా సినిమాను కంప్లీట్ గా ఆపేస్తారా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

Related News

Dude Collections : దీపావళి విన్నర్… మూడు రోజుల్లో డ్యూడ్‌కు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Telusu kada Collections : తెలుసు కదా కలెక్షన్లు… సిద్ధూకు మరో ‘జాక్’ పాట్ ?

K Ramp Collections : బాక్సాఫీస్ వద్ద ‘కే ర్యాంప్’ మోత.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..!

Rashmika: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన రష్మిక.. నరకం అనుభవించానంటూ?

Vishal: ఆ డైరెక్టర్ తో గొడవలు నిజమే.. విశాల్ అదిరిపోయే రియాక్షన్!

Samantha: మళ్లీ అడ్డంగా దొరికిన సమంత.. పండుగ పూట కూడా వదలరా?

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్

Big Stories

×